కేటీఆర్ శత్రుశేషం లేకుండా చేసుకుంటున్నాడా?

కాబోయే సీఎం తెలంగాణ సీఎం కుమారుడు.. మంత్రి కేటీఆర్ కు ప్రత్యర్థి లేకుండా పోతున్నాడా? చూస్తుంటే పరిస్థితి అలానే కనిపిస్తోందట.. ఇప్పటికే ఓ బలమైన ప్రత్యర్థిని లాగేసి అత్యున్నత పదవిలో కూర్చుండబెట్టిన కేటీఆర్.. ఇప్పుడు మరో ప్రత్యర్థిని బుట్టలో వేశాడని అంటున్నారు.

కాంగ్రెస్ పని ఖతమైందని ఆ నేతల్లో నిరాశ నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి. దీంతో శత్రుశేషం లేకుండా చేసుకోవాలని టీఆర్ఎస్ మంత్రదండం ప్రయోగిస్తున్నారట..

సీఎం కేసీఆర్ కు గత ఎన్నికల్లో కొరకరాని కొయ్యగా మారాడు వంటేరు ప్రతాపరెడ్డి. కాంగ్రెస్ తరుఫున గజ్వేల్ లో పోటీచేసిన ప్రతాప రెడ్డి ఏకంగా సీఎం కేసీఆర్ కే చుక్కలు చూపించి ఓడించినంత పనిచేశాడు. దీంతో ఆయనను జైలు పాలు చేసి కేసుల్లో ఇరికించి నానా రకాలుగా హింసించారనే ప్రచారం ఉంది. ఒకదశలో ఆయన ఇక రాజకీయాలు చాలనుకున్నారు. కానీ చివరకు టీఆర్ఎస్ లో చేరి ఇప్పుడు అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా అయ్యారు. అలా కేసీఆర్ తన ప్రత్యర్థి శత్రువులను తనదారికి తెచ్చుకున్నారు.

ఇప్పుడు కేటీఆర్ కు ప్రధాన ప్రత్యర్థి సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పబోతున్నాడట.. స్వతహాగా ముందు టీఆర్ఎస్ నేత అయిన మహేందర్ రెడ్డి సీటును కేటీఆర్ 2009లో లాక్కొని పోటీచేశాడు. అప్పటి నుంచి కాంగ్రెస్ తరుఫున నిలబడుతూ కేటీఆర్ కు ప్రధాన శత్రువు ప్రత్యర్థిగా మారాడు. ఇదివరకు కాంగ్రెస్ ఇన్ చార్జిగా ఉన్న కొండూరు రవీందర్ రావును టీఆర్ఎస్ లోకి లాగిన కేటీఆర్ ఆయనకు టెస్కాబ్ చైర్మన్ లాంటి రాష్ట్రస్థాయి పదవి ఇచ్చి తనకు అడ్డులేకుండా చేసుకున్నాడు. ఇప్పుడు మహేందర్ రెడ్డిని లాగేసే పనిలో పడ్డారు.

ఇటీవలే కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న మహేందర్ రెడ్డి చూపు టీఆర్ఎస్ పై పడుతోంది. కేటీఆర్ అభయమిచ్చి పెద్ద పదవి ఇస్తే వెంటనే గులాబీ కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారడట.. వంటేరు ప్రతాప్ రెడ్డి లాగా మహేందర్ రెడ్డి కూడా ఇక పోరాటం ఆపి కేటీఆర్ పంచన చేరి ఏదైనా పదవి పొందాలనే చూస్తున్నాడనే ప్రచారం సాగుతోంది. ఇలా తమ సొంత నియోజకవర్గాల్లో శత్రుశేషం లేకుండా కేసీఆర్ కేటీఆర్ లు చేసుకుంటూ తమ రాజకీయ జీవితాన్ని కలకలం సాగేలా చేసుకుంటున్నారన్న మాట..
× RELATED ఫేస్ బుక్ తాజా నిర్ణయం..వచ్చే జులై వరకు వర్క్ ఫ్రం హోం!
×