షాక్ :కరోనా వచ్చిందని జర్నలిస్టు ఆత్మహత్య

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృతి కొనసాగుతోంది. మన దేశంలోనూ పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. దాదాపు ప్రపంచంలోనే మూడో స్థానానికి మనం చేరుకున్నాం. రోజూ 20 వేలకుపైగా కొత్త కేసులు భారీ స్థాయిలో మరణాల సంఖ్యతో దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి. కోవిడ్ వారియర్లలో ఒకరనే గుర్తింపు పొందిన జర్నలిస్టుల్లో ఒకరనే వ్యక్తి ఈ కరోనా మహమ్మారి కారణంగా ఆత్మహత్య ప్రయత్నం చేశారు. అయితే ఇందులో షాకింగ్ నిజాలు ఉన్నాయి.

ఢిల్లీలోని ఓ జర్నలిస్టుకు కరోనా సోకింది. దీంతో ఓ ప్రముఖ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్న 34 ఏళ్ల ఆ వ్యక్తి ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే విషయంలో మేనేంజ్మెంట్ షాకింగ్ నిర్ణయం తీసుకుందని సమాచారం. అతనికి కరోనా సోకిందని తేలడంతో విధుల్లో నుంచి తప్పించింది. కాగా సదరు వ్యక్తి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఎయిమ్స్ ట్రామా కేర్ సెంటర్ నాలుగో అంతస్తు నుంచి కిందకు అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బాధితుడి బంధువులు ఆ పాత్రికేయుడి ఆత్మహత్య విషయంల మేనేజ్మెంట్ వైఖరిని తెలియజేశారని పోలీసులు వెల్లడించారు.

ఇదిలాఉండగా కరోనా మహమ్మారి బారినపడ్డ కొందరు రోగులు తట్టుకోలేపోతున్నారు. తాము బతుకుతామో చనిపోతామోనన్న ఆందోళనతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత కొన్ని రోజులుగా కరోనా బాధితుల ఆత్మహత్యల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. తాజాగా ఢిల్లీలో జరిగిన ఈ ఘటన పలువురిని కలచివేసింది.
× RELATED రెండు ముక్కలైన విమానంలో నుంచి నిప్పు రాజుకోలేదెందుకు?
×