గుండెలను పిండేస్తున్న సుశాంత్ చివరి మూవీ ట్రైలర్!!

ఇటీవలే బలవన్మరణానికి పాల్పడిన సినీ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ గురించి రోజుకో చర్చ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నిన్నటి వరకు సుశాంత్ మరణం పై సంబంధం లేదన్నట్లు కొందరు మాట్లాడితే.. మరి కొందరు అతనిలోని మంచితనాన్ని పొగిడేస్తున్నారు. ఎందుకో తెలియదు కానీ ఈరోజు సుశాంత్ లాస్ట్ సినిమా 'దిల్ బేచారా' ట్రైలర్ విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాతో ముకేశ్ చాబ్రా డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో సంజన సంఘీ హీరోయిన్. సంజనకి కూడా ఇదే తొలి సినిమా కావడం విశేషం. కానీ సుశాంత్ చివరి సినిమా కూడా ఇదే కావడం కాస్త బాధాకరమైన విషయం.

కొన్ని గంటల క్రితమే ఈ ట్రైలర్ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ట్రైలర్ విడుదలకు సంబంధించి మేకర్స్ ముందుగానే అధికారిక ప్రకటన చేశారు. ఇక హీరోయిన్ సంజనా కూడా ట్రైలర్ విడుదలకు సంబంధించిన పోస్టర్ను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఆ పోస్టర్ కింద కాప్షన్ "తనకు ఎంతో ఇష్టమైన సీన్లలో ఇది ఒకటి" అనే కాప్షన్ కూడా జోడించింది. ఇక ట్రైలర్ చూసిన వారందరికీ సుశాంత్ లైఫ్ గురించి కాస్త ఎమోషనల్ అవ్వడం పక్కా. ట్రైలర్ లో సుశాంత్ పలికే ప్రతీ డైలాగ్ ఆయన అభిమానుల హృదయాలను టచ్ చేస్తోంది.

అందులో "ఎలా పుట్టాలి.. ఎప్పుడు చావాలి అనేది మనం డిసైడ్ చేయలేం.. కానీ ఎలా బతకాలన్నది మాత్రం మన చేతుల్లోనే ఉంది"అంటూ వినిపిస్తున్న సుశాంత్ డైలాగ్ అభిమానుల కళ్లలో నీళ్లు తిరిగేలా చేస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్కు క్యాన్సర్ ఉంటుందని అర్ధమవుతుంది. ఆమెను కలిసిన హీరో ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత హీరోయిన్ కోరికలన్నీ ఒక్కొక్కటిగా తీరుస్తుంటాడు. ఎంతో ఎమోషనల్ టచ్ ఉన్న ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్రయూనిట్ ఆకాంక్షిస్తున్నారు. ఇక ఈ సినిమా జూలై 24న డిస్నీ హాట్స్టార్లో విడుదల కానుంది. అయతే ఎలాంటి సబ్స్క్రిప్షన్ చార్జీలు లేకుండా ఉచితంగా అందరికి అందుబాటులో ఉండనుంది. మరి ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి!
× RELATED సారీలో సుందరి సోయగాలు చూస్తే దాసోహం కావాల్సిందే!
×