మన ప్రవర్తన అలా ఉండొద్దు: కంగన రనౌత్పై ఘాటుగా తాప్సీ

బాలీవుడ్ తార కంగనా రనౌత్ డిజిటల్ స్టాఫ్ ఇటీవల నెపోటిజం అంశంపై నటి తాప్సీపై విమర్శలు గుప్పించింది. సినీ నేపథ్యం లేకుండా వచ్చిన కొంతమంది మూవీ మాఫియా దృష్టిలో బాగా ఉండాలని భావిస్తున్నారని కంగనపై దాడి చేస్తున్నారని తాప్సీ.. నిన్ను చూసి సిగ్గుపడుతున్నాం అంటూ కంగన టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

దీనికి తాప్సీ ఘాటుగా స్పందించింది. కొంతమంది మనుషులు మంచిలో కూడా చెడును చూస్తారని పరోక్షంగా చురకలు అంటించింది. కొందరు వ్యక్తులు మంచిలో కూడా చెడును చూస్తారని అలాంటి వ్యక్తుల్ని కూడా దేవుడు మంచిగానే చూస్తాడని అలాంటి వారి గురించి మనం ప్రార్థనలు చేయాలని వారు చెడ్డవారు అని తెలిసినప్పటికీ వారితో మనం చెడుగా ప్రవర్తించవద్దని వారు కూడా ఎదగాలని కోరుకోవాలని మన ప్రవర్తన ఎలా ఉండకూడదో వారిని చూసి తెలుసుకోవాలని పేర్కొంది.

నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్లో నెపోటిజంపై జోరుగా చర్చ సాగుతోన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కంగన ఓ వీడియోలో పలు అంశాలు వెల్లడించారు. బాలీవుడ్లో నెపోటిజం గురించి మాట్లాడారు. ఓ సమయంలో కంగనా టీమ్.. తాప్సిని ఈ వివాదంలోకి లాగారు. దీంతో తాప్సీ స్పందించింది. అనంతరం ఇరువైపుల మాటల యుద్ధం సాగుతోంది.
× RELATED సారీలో సుందరి సోయగాలు చూస్తే దాసోహం కావాల్సిందే!
×