ఆ వ్యాక్సిన్ కరోనాకు పనిచేస్తుందేమో... వినాయక్ !

తొలుత కరోనా చుట్టూ ఎన్నో భయాలుండేవి ఇపుడు ఎన్నో ప్రశ్నలు మరెన్నో చర్చలు ఆ భయాలను అధిగమించాయి. ఇపుడు కరోనా రాకుండా ఎలా ఉండాలి అనే చర్చ కన్నా... వస్తే ఏం చేయాలన్న చర్చ ఎక్కువగా సాగుతోంది. మరోవైపు భారత్ బయోటిక్ ఆవిష్కరణతో వ్యాక్సిన్ పై ఆశలు పెరిగాయి. అయితే ఓ సరికొత్త విషయంతో మన ముందుకు వచ్చారు టాలీవుడ్ దర్శకులు వివి వినాయక్.

ప్రపంచమంతటా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా? అని ఆశగా ఎదురుచూస్తుంటే... ఇప్పటికే అందుబాటులో ఉన్న ఒక వ్యాక్సిన్ కరోనా రాకుండా ఆపుతుందేమో అన్న అనుమానాన్ని వ్యక్తంచేస్తూ దర్శకుడు వినాయక్ ఓ వీడియో విడుదల చేశారు. ఆయన చెబుతున్న విషయాలు చూస్తుంటే కాస్తంత ఆసక్తికరంగా వాస్తవానికి దగ్గరగా అనిపిస్తోంది

"గతంలో ఓ సారి కెన్యా పర్యటనకు వెళ్లాను. అక్కడికి వెళ్లాలంటే ఎల్లో ఫీవర్ ఇంజెక్షన్ తప్పనిసరిగా వేసుకోవాలని చెప్పారు. ఆ ఇంజెక్షన్ తీసుకునేటపుడు ఎల్లో ఫీవర్ లక్షణాలు అడిగి తెలుసుకున్నాను. ఎల్లో ఫీవర్ లక్షణాలు కరోనా లక్షణాలుగా సిమిలార్ గా ఉన్నాయి అనిపిస్తుంది. అందుకే ఈ వీడియో విడుదల చేస్తున్నాను. ఎల్లో ఫీవర్ కోసం నేను వేయించుకున్న ఇంజెక్షన్ కరోనాకు పనిచేస్తుందేమో అని నా అనుమానం" అంటూ వినాయక్ వీడియో సందేశం ఇచ్చారు. తనకు ఆ ఇంజెక్షన్ ఇప్పటికే వేసుకున్నందున కరోనా సోకదేమో అన్న అనుమానమూ వెలిబుచ్చారాయన.

ఎల్లో ఫీవర్ అనేది ఒక దోమ వల్ల వ్యాపించే వైరస్ ద్వారా వస్తుంది. ఆఫ్రికాలోని సహారా ప్రాంతంలోని దోమల వల్ల ఇది వ్యాపిస్తుంది. ఇది సోకితే జ్వరం తలనొప్పి వాంతులు నీరసం ఆకలి కోల్పోవడం స్కిన్ రాషెస్ వస్తాయి. ఇవి మైల్డ్ కేస్ లక్షణాలు. సీరియస్ కేసుల్లో హార్ట్ లివర్ కిడ్నీ ఫెయిల్యూర్ జరుగుతుంది. ఇవన్నీ WHO నిర్దారించిన ఎల్లో ఫీవర్ లక్షణాలు. వినాయక్ చెప్పినట్టు ఇవన్నీ కరోనా లక్షణాలే అయినా.. కరోనా ప్రధానమైన ప్రభావం ఊపిరితిత్తుల మీద ఉంటుంది. ఇదే కీలకమైనది. చనిపోయే కేసుల్లో ఊపిరితిత్తులు పనిచేయక వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు. ఇది వినాయక్ మిస్సయిన కీలక అంశం. అయినా కూడా వైద్య ప్రముఖులు వినాయక్ చెప్పిన వ్యాక్సినేషన్ ను పరిగణలోకి తీసుకుంటే అది కరోనా వ్యాక్సిన్ తయారీకి చాలావరకు ఉపయోగపడొచ్చేమో మరి చెప్పలేం.
× RELATED సారీలో సుందరి సోయగాలు చూస్తే దాసోహం కావాల్సిందే!
×