‘బాహుబలి’ ఏడేళ్ల క్రితం జ్ఞాపకం

టాలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ సినీ చరిత్రలో నిలిచి పోయే చిత్రం బాహుబలి. ఆ సినిమా విడుదల అయ్యి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఏ ఇండియన్ సినిమా కూడా ఆ రికార్డులను బ్రేక్ చేయలేక పోతున్నాయి. రాబోయే పదేళ్ల కాలంలో కూడా బాహుబలి రికార్డులను బ్రేక్ చేసే సత్తా ఉన్న సినిమా వచ్చే అవకాశం లేదని విశ్లేషకులు చాలా బలంగా చెబుతున్నారు. బాహుబలి సినిమా కోసం జక్కన్న పడ్డ కష్టం మామూలుది కాదు. సినిమా కోసం ఆయన దాదాపు రెండు సంవత్సరాల పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాడు.

2013 జులై 6వ తారీకున బాహుబలి చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యింది. చుట్టు వేలాది మంది ఉండగా ప్రభాస్ పై కొన్ని షాట్స్ ను జక్కన్న తీశాడు. సినిమా షూటింగ్ మొదలు పెట్టిన రోజుకు నేటితో ఏడు సంవత్సరాలు అయ్యింది. ఈ సందర్బంగా బాహుబలి అధికారిక ట్విట్టర్ వేదికలో అప్పటి జ్ఞాపకాలను షేర్ చేశారు.

మొదటి రోజు షూటింగ్ ఫొటోతో పాటు రామోజీ ఫిల్మ్ సిటీలో రాజమౌళి సీన్ వివరిస్తున్న ఫొటోను షేర్ చేశారు. బాహుబలి మొదటి పార్ట్ ను 2015 జులై 10వ తారీకున విడుదల చేశారు. ఇక బాహుబలి రెండవ పార్ట్ 2017 ఏప్రిల్ 28న విడుదల అయ్యింది. ప్రస్తుతం జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమా తీస్తున్నాడు. ఆ సినిమా బాహుబలిని మించి ఉంటుందా లేదా అనేది చూడాలి.
× RELATED సారీలో సుందరి సోయగాలు చూస్తే దాసోహం కావాల్సిందే!
×