అది లేదంటే ఇది.. ఆగేదే లేదంటున్న అనీల్

స్టార్ డైరెక్టర్స్ ఒక్కో సినిమాకు ఏడాది రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకుంటున్నారు. కొందరు దర్శకులు హిట్ కొట్టినా కూడా మూడు సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అలాంటిది దర్శకుడు అనీల్ రావిపూడి ఏమాత్రం ఆలస్యం చేయడం లేదు. గత ఏడాది ఎఫ్ 2 చిత్రంతో వచ్చిన అనీల్ ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రంతో వచ్చాడు. వచ్చే సంక్రాంతికి మరో సినిమాతో ఖచ్చితంగా వచ్చేవాడు. కాని మహమ్మారి వైరస్ కారణంగా ఆయన వచ్చే ఏడాది సంక్రాంతి మిస్ చేసుకోబోతున్నాడు.

సంక్రాంతి మిస్ అయినా వచ్చే ఏడాదిని మాత్రం మిస్ చేయకూడదని అనీల్ చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తొస్తోంది. ఇప్పటికే ఎఫ్ 3 చిత్రంకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడు. వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు ఎఫ్ 3 ని మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే వారిద్దరు కూడా ఇతర సినిమాలను కమిట్ అయ్యి ఉండటం వల్ల ఎఫ్ 3 ఆలస్యం అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ఒక వేళ ఎఫ్3 లేట్ అయితే ఈ గ్యాప్ లో మరో సినిమాను చేయాలని స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడు.

ఈ మూడు నెలల గ్యాప్ లో అనీల్ రావిపూడి ఎఫ్ 3 కాకుండా మరో స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడట. ఒక యంగ్ హీరో ఆ సినిమా పై ఆసక్తిగా ఉన్నాడట. ఎఫ్ 3 మొదలు పెట్టడానికి చాలా నెలలు సమయం ఉంటే మాత్రం యంగ్ హీరోతో సినిమా మొదలు పెట్టి వచ్చే ఏడాది దసరా లేదా దీపావళి వరకు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఎఫ్ 3 సినిమాను కూడా వచ్చే ఏడాదిలోనే మొదలు పెట్టి 2022 సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు.
× RELATED సారీలో సుందరి సోయగాలు చూస్తే దాసోహం కావాల్సిందే!
×