రాజమౌళి టెస్ట్ షూట్ ఏమైంది?

మూడు నెలల విరామం తర్వాత తెలుగు సినిమా షూటింగ్స్ కు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. గత నెలలోనే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేశారు. గండిపేట పరిసర ప్రాంతాల్లో టెస్ట్ షూట్ నిర్వహించబోతున్నట్లుగా కూడా అనధికారికంగా ప్రకటన వచ్చింది. సినిమా షూటింగ్ మొదట డమ్మీ నటి నటులతో చేస్తున్నారని ఆ తర్వాత ఎన్టీఆర్ చరణ్ లు నటించబోతున్నారూ అంటూ వార్తలు వచ్చాయి.

హైదరాబాద్ లో పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకు వేల సంఖ్యలో పెరుగుతున్న కారణంగా షూటింగ్ సన్నాహాలు ఆపేశారట. ప్రస్తుతము ఉన్న పరిస్థితుల్లో షూటింగ్ అంటే ప్రాణాలతో చెలగాటం అని సీరియల్ ఆర్టిస్టుల పరిస్థితి చూస్తుంటే అర్థం అవుతుంది. అందుకే ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ను ఇంకొంత కాలం వాయిదా వేయాలని నిర్ణయించారు. షూటింగ్ ఎప్పుడు ప్రారంభించేది చెప్పలేని పరిస్థితి. అందుకే చిత్రం కోసం సాలరీ బేసిన్ లో వర్క్ చేస్తున్న వారికి జీతాలు ఆపేశారట. దీన్ని బట్టి ఇప్పట్లో సినిమా షూటింగ్ ప్రారంభం కాదేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
× RELATED రియా ప్రయాణిస్తున్న కారు ఎవరిది...?
×