ఔను కొన్ని సార్లు తప్పదంటున్న సురేష్ బాబు

టాలీవుడ్ దిగ్గజ దర్శకుల జాబితాలో సురేష్ బాబు పేరు ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించాడు. సురేష్ బాబు తండ్రి రామానాయుడు ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించారు. కాని సురేష్ బాబు మాత్రం ఎప్పుడు సేఫ్ గేమ్ ఆడుతూ వస్తున్నాయి. బడ్జెట్ విషయంలో ఇతర నిర్మాతలు దూకుడుగా ఉన్నా కూడా సురేష్ బాబు మాత్రం చాలా నిలకడగా వ్యవహరిస్తూ వచ్చాడు. ఈమద్య కాలంలో చిన్న సినిమాలను కూడా సొంతంగా నిర్మించడం లేదు. అలాంటిది రానా హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందబోతున్న హిరణ్య కశ్యప చిత్రం కోసం ఏకంగా 200 కోట్లకు పైగా ఖర్చు పెట్టేందుకు ఓకే చెప్పాడని అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి.

సురేష్ బాబు అంతగా బడ్జెట్ పెట్టడం అనుమానమే అనుకున్న వారికి స్వయంగా ఆయనే సమాధానం ఇచ్చాడు. తాజాగా హిరణ్యకశ్యప చిత్రం బడ్జెట్ గురించి స్పందిస్తూ.. కొన్ని కథలను చాలా ఖర్చు పెట్టి చూపించాలి. ఆ కథలను భారీ బడ్జెట్ పెడితేనే న్యాయం జరుగుతుంది. ఒక వేళ తక్కువ బడ్జెట్ తో అలాంటి సినిమాలను తెరకెక్కిస్తే ప్రేక్షకులు ఒప్పుకోరు. అందుకే కొన్ని సార్లు భారీ బడ్జెట్ చిత్రాలు తప్పవు. అందుకే హిరణ్య కశ్యప చిత్రం కోసం భారీగా ఖర్చు పెట్టబోతున్నట్లుగా సురేష్ బాబు పేర్కొన్నాడు.

స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యిందని ఇటీవలే గుణ శేఖర్ హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాను మొదలు పెట్టడం సాధ్యం కాదు. అందుకే వచ్చే ఏడాది రానా చేస్తున్న సినిమాలు పూర్తి అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించే అవకాశం ఉందంటున్నారు. దాదాపు ఏడాది నుండి ఏడాదిన్నర వరకు ఈ మూవీ షూటింగ్ ను జరిపే అవకాశం ఉంది. 2021లో ప్రారంభించి 2023లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా నిర్మాణంలో ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ భాగస్వామిగా ఉండే అవకాశం ఉంది.
× RELATED రాజమౌళి సార్ ఆర్ఆర్ఆర్ ఓటిటిలో రిలీజ్ చేయొద్దు అంటున్న ఎన్టీఆర్ హీరోయిన్
×