వర్మ ‘పవర్ స్టార్’ గా భద్రాచలం నరేష్

రామ్ గోపాల్ వర్మ ఏటీటీ అంటూ వరుసగా సినిమాలను విడుదల చేస్తున్నాడు. ఈ సినిమాలకు సెన్సార్ అక్కర్లేదు క్వాలిటీ విషయంలో పట్టింపు లేదు. కనుక నెలలోపే సినిమాను పూర్తి చేస్తున్నారు. క్లైమాక్స్.. ఎన్ఎన్ఎన్ చిత్రాలను అతి తక్కువ సమయంలో పూర్తి చేశాడు. ఇప్పుడు ప్రస్తుతం మర్డర్ చిత్రంతో పాటు పవర్ స్టార్ చిత్రాలను తెరకెక్కించేందుకు సిద్దంగా ఉన్నాడు. మర్డర్ చిత్రాన్ని షూటింగ్ మొదలు పెట్టగా పవర్ స్టార్ సినిమాను త్వరలో ప్రారంభిస్తాడట.

వర్మ తన సినిమాలోని పాత్రలకు నటీనటులను ఎంపిక చేసుకునే విధంగా నిజంగా జీనియస్ అంటూ ఆయన అభిమానులు అంటూ ఉంటారు. తాజాగా పవర్ స్టార్ సినిమాను ప్రకటించిన వర్మ అందులో ముఖ్య పాత్రకు నటించబోతున్న నటుడిని కూడా పరిచయం చేశాడు. ఒక వీడియోను పోస్ట్ చేసి పవర్ స్టార్ మా ఆఫీస్ కు వచ్చి వెళ్తున్నాడు అంటూ ట్వీట్ చేశాడు.

ఆ వీడియోలో అచ్చు పవన్ లా ఉన్న ఆ వ్యక్తి గురించి నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. వర్మ అతడిని టిక్ టాక్ లో పట్టాడట. భద్రాచలంకు చెందిన నరేష్ అనే ఆ వ్యక్తి హైదరాబాద్ లో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడిని వర్మ స్వయంగా కారు పంపించి మరీ తన ఆఫీస్ కు రప్పించుకున్నాడు. పవర్ స్టార్ సినిమాలో నటించాల్సిందిగా అడిగిన సమయంలో మొదట నరేష్ ఒప్పుకోలేదట. ఆ తర్వాత వర్మ చెప్పిన మాటలతో కన్విన్స్ అయ్యి ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి పవర్ స్టార్ ను సెట్ చేసిన వర్మ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు.
× RELATED తమిళ అమ్మాయి పాత్రలో మెరవనున్న శర్వానంద్ హీరోయిన్!!
×