సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆ డైరెక్టర్ పై కన్నేశారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీ కి `పెళ్లి చూపులు` సినిమా తో ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఆ సినిమా తో జాతీయ స్థాయి అవార్డు తో పాటు మర్చి పోలేని ప్రశంసలను కూడా అందుకున్నాడు. ఇక రెండో సినిమా గా `ఈ నగరానికి ఏమైంది` చేశాడు. ఆ సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు అవుతుంది. కానీ ఇంత వరకు తన మూడవ సినిమా గురించి ప్రస్తావించ లేదు. నిజానికి మూడో సినిమా విక్టరీ వెంకటేష్ తో అనుకున్నాడు కానీ అది ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఇదిలా ఉండగా.. తరుణ్ భాస్కర్ ప్రస్తుతం వార్తలలో తెగ చక్కర్లు కొడుతున్నాడు. గతంలో `జనతా గ్యారేజ్` మూవీ సమయంలో ఎన్టీఆర్ అభిమానుల నుంచి తరుణ్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. తాజాగా మరో స్టార్ హీరో అభిమానులకు టార్గెట్ అయినట్లు తెలుస్తుంది.

ఆ హీరో ఎవరో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ ఫ్యాన్స్ తరుణ్ భాస్కర్ ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా ట్వీట్లతో ట్రోల్ చేస్తున్నారట. ఇక ఇటీవల మలయాళ మూవీ `కప్పెల` సినిమా చూసిన తరుణ్.. "కమర్షియల్ సినిమాలపై హీరోలపై ఓ రేంజ్లో కౌంటర్లు వేశాడట. "హీరో పిచ్చోడిలా గట్టిగా రీసౌండ్ చేసుకుంటూ అరవడు. అందరి కంటే స్మార్ట్‌గా ప్రతి డైలాగ్‌లో సామెత చెప్పడు. ఎక్సట్రీమ్ స్లోమోషన్లో ఫిజిక్స్ ఫెయిలయ్యేలా ఫైట్లు వుండవు. ప్రతీ రెండు నిమిషాలకు హీరో ఎంట్రీ వుండదు. చివరి పది నిమిషాల్లో రాండమ్‌గా రైతుల గురించో సైనికుల గురించో దేశం గురించో మెసేజ్ వుండదు. మరి దీన్ని కూడా సినిమా అంటారు మరి ఆ ఊర్లో" అని తరుణ్‌భాస్కర్ తన అభిప్రాయం చెప్పారు. అయితే తరుణ్ విమర్శించిన వాటిల్లో మహేష్ నటించిన మహర్షి.. సరిలేరు నీకెవ్వరు సినిమాల కాన్సెప్ట్‌లు ఉయూ ఉండటంతో మహేష్ ఫ్యాన్స్ నుండి తరుణ్ పై విమర్శలు వస్తున్నాయి. దీంతో తరుణ్ భాస్కర్ కూడా మహేష్ ఫ్యాన్స్‌కి గట్టి కౌంటర్ ఇచ్చాడట. ఫేక్ అకౌంట్లతో ట్రోల్ చేసే వారిని అసలు పట్టించుకోనని షాక్ ఇచ్చాడు.
× RELATED రాజమౌళి సార్ ఆర్ఆర్ఆర్ ఓటిటిలో రిలీజ్ చేయొద్దు అంటున్న ఎన్టీఆర్ హీరోయిన్
×