వదిన తో అక్రమ సంబంధం... అన్న ని చంపిన తమ్ముడు !

ఈ ప్రపంచం లో రోజు రోజుకి వావి వరుసలు అంటూ లేకుండా పోతున్నాయి. అక్రమ సంబంధాల కోసం అడ్డ దారుల్లో వెళ్లే వారు ఎక్కువై పోతున్నారు. ఉన్న దాని తో సంతృప్తి పడకుండా.. లేని దాని కోసం తాపత్రయపడే వారి సంఖ్య పెరిగిపోతుంది. అయితే ఇలా లేనిదాని కోసం తాపత్రయపడి ఉన్న బంగారు అలాంటి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు చాలామంది. తాజాగా  వదినతో అక్రమ సంబంధం పెట్టుకొని సొంత అన్నయ్యను చంపాడు తమ్ముడు. ఈ సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.

ఈ ఘటనపై పూర్తి వివరాలు చూస్తే..ఆత్మకూరుకు చెందిన నాగరాజు(27)కు ప్రకాశం జిల్లా సాకవరానికి చెందిన ఈశ్వరమ్మతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. మద్యానికి బానిసైన నాగరాజు అప్పుల పాలైన వాటిని తీర్చేందుకు ఓ ప్లాటును విక్రయించాడు. భర్త నిత్యం మద్యం తాగుతూ తనను పట్టించుకోకపోవడంతో ఈశ్వరమ్మ తన మరిది మహేష్కు దగ్గరైంది. మరిదితో అక్రమ సంబంధం పెట్టుకుని రోజూ రాసలీలలు కొనసాగిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నాగరాజు పద్ధతి మార్చుకోవాలని ఇద్దరిని హెచ్చరించాడు.

ఈ క్రమంలోనే నాగరాజు చేసిన అప్పులు తీర్చేందుకు తల్లి మరో ప్లాటు అమ్మాలని నిర్ణయించింది. కుటుంబానికి మిగిలివున్న ఆ ఒక్క ప్లాటు కూడా విక్రయిస్తే ఆస్తి లేకుండా పోతుందని ఈశ్వరమ్మ మహేష్ ఆలోచించారు. నాగరాజు చంపేస్తే ఆస్తి నిలవడంతో పాటు తమ బంధానికి అడ్డు లేకుండా పోతుందని అనుకున్నారు. ఈ నెల 24న నాగరాజు తల్లి బంధువుల ఇంటికి వెళ్లింది. ఆ రోజు రాత్రి నాగరాజుతో కలిసి మహేష్ వారి మేనమామ మద్యం తాగారు. మత్తులోకి జారుకున్న అతడిని ప్రభుత్వాసుపత్రికి ఎదురుగా ఉండే నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశారు.అనంతరం మహేష్ ఈశ్వరమ్మ కలిసి నాగరాజు శవాన్ని అక్కడే ఓ గుంతలో పూడ్చిపెట్టారు. శనివారం వీధి కుక్కలు శవాన్ని బయటకు లాగడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా హత్యగా నిర్ధారణ కావడంతో నిందితులిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
× RELATED ఘనంగా పెళ్లి.. నిబంధనల ఉల్లంఘనతో జైలులో కాపురం
×