ఓటీటీ స్టార్ట్ చేయబోతున్నారనే వార్తలపై స్పందించిన స్టార్ ప్రొడ్యూసర్...?

ప్రస్తుతం జనాలు ఎక్కువగా ఇంటికే పరిమితం అవడంతో ఎంటెర్టైమెంట్ కోసం డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ని ఆశ్రయిస్తున్నారు. దీంతో ఈ కరోనా డేస్ లో ఓటీటీలకి ఆదరణ లభించింది. ఇక రాబోయే రోజుల్లో కూడా వెబ్ కంటెంట్ హవా కొనసాగే అవకాశాలున్నాయని... ఓటీటీలదే రాజ్యం కాబోతుందని భావిస్తున్న పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు డిజిటల్ రంగంలోకి అడుగు వేస్తున్నారు. ఇప్పటికే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ డిజిటల్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా'ని క్రియేట్ చేశారు. ఇక శరత్ మరార్ స్వప్న దత్ క్రిష్ లాంటి వారు వెబ్ కంటెంట్ తో ఓటీటీ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ వైపు అడుగులు వేశారు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు కూడా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ఓటీటీ స్టార్ట్ చేయబోతున్నట్లు గత కొన్నిరోజులుగా వార్తలు వచ్చాయి.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించిన సురేష్ బాబు.. ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రారంభించాలంటే చాలా పెద్ద మొత్తం లో పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని.. పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రికవరీ చేయడానికి చాలా ఓపిక అవసరమని చెప్పుకొచ్చాడట. ఓటీటీ వ్యాపారంలోకి ప్రవేశించే విషయంలో నేను ఇంకా అనిశ్చితితో ఉన్నానని స్పష్టం చేశారట. కాకపోతే ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం వెబ్ కంటెంట్ ను రూపొందించే ఆలోచన మాత్రం ఉందని వెల్లడించారట. అంతే కాకుండా ప్రొడ్యూసర్ గా వ్యవహరించే మీరు ఎప్పుడైనా సినిమా డైరెక్షన్ చేసే అవకాశం ఉందా అని అడుగ గా.. దీనికి సురేష్ బాబు ''ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా నిర్మిస్తామో లేదో అనే దాని మీదే గ్యారెంటీ లేదు. అలాంటిది ఇక సినిమా ని డైరెక్ట్ చేయడమా?'' అని చెప్పుకొచ్చాడట.

ఇక సినిమాల విషయానికొస్తే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకటేష్ హీరోగా తమిళ 'అసురన్' రీమేక్ 'నారప్ప' సినిమాని నిర్మిస్తున్నారు. దీనికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు గుణశేఖర్ - రానా కాంబినేషన్ లో 'హిరణ్యకశ్యప' అనే సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సిద్ద పడుతున్నారు. ఇక బాలీవుడ్ లో విజయం సాధించిన 'సోనూ కే టిటు కి స్వీటీ' 'డ్రీమ్ గర్ల్' సినిమాలను తెలుగు లో రీమేక్ చేయనున్నారు.
× RELATED తమిళ అమ్మాయి పాత్రలో మెరవనున్న శర్వానంద్ హీరోయిన్!!
×