థియేటర్లలో సందడి చేద్దాం అంటున్న ఇద్దరు స్టార్ హీరోలు!

ప్రస్తుత లాక్ డౌన్ నేపథ్యంలో ఫిల్మ్ ఇండస్ట్రీ కోలుకోలేని దెబ్బతిన్నది. ఈ మహమ్మారి కారణంగా విడుదల కావాల్సిన సినిమాలు.. షూటింగ్స్ జరుపుకుంటున్న సినిమాలు అన్నీ నిలిచిపోయి మూడు నెలలు దాటింది. ఇంతవరకు ఒక్క సినిమా షూటింగ్ కూడా ముందుకు కదలలేదు. అయితే ఆల్రెడీ విడుదలకు సిద్ధమైన సినిమాలు మాత్రం థియేటర్లు తెరచుకోవని తెలిసి ఓటిటిల వైపు మళ్లుతున్నాయి. ఈ లాక్ డౌన్ కాలంలో ఓటిటిల హవా మాములుగా లేదు. చిన్న.. మీడియం సినిమాలన్నీ ఓటిటిలో విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ముందడుగు వేస్తున్నారు. ఇక ఇటీవలే అమితాబ్ బచ్చన్ ఆయుష్మాన్ ఖురానాల 'గులాబో సీతాబో' విడుదల అయింది. అలాగే అక్షయ్ కుమార్ 'లక్ష్మిబాంబ్' త్వరలో విడుదల కానుంది. తాజాగా రూపొందిన అక్షయ్ కుమార్ 'సూర్యవంశీ'.. అలాగే రన్వీర్ సింగ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న '83' సినిమాలు కూడా ఓటిటిలో విడుదల అవుతాయని వార్తలొచ్చాయి. కానీ అవన్నీ పుకార్లు అని తేల్చేశాయి చిత్ర బృందాలు.

బాలీవుడ్ హిట్ డైరెక్టర్ రోహిత్ శెట్టి.. అక్షయ్ కుమార్ తో యాక్షన్ సినిమా రూపొందించాడు. ఈ సినిమా పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అలాగే 1983లో ఇండియాకి క్రికెట్ వరల్డ్ కప్ అందించిన సారధి కపిల్ దేవ్.. జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న '83'. ఈ సినిమాను భజరంగి భాయిజాన్ ఫేమ్ కబీర్ ఖాన్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లకు అనూహ్యమైన స్పందన లభించింది. అయితే ప్రస్తుతం థియేటర్లు తెరిచే పరిస్థితులు లేకపోవడంతో ఈ రెండు సినిమాలు ఓటిటిలో రానున్నాయని అంతా అనుకున్నారు. కానీ ప్రేక్షకుల అంచనాలను తారుమారు చేస్తూ.. రెండు సినిమాలు ఎప్పుడు విడుదల కానున్నాయో తెలిసింది. ఈ ఏడాది దీవాలికి అక్షయ్ కుమార్ 'సూర్యవంశీ'.. ఇక క్రిస్టమస్ ఫెస్టివల్ సందర్భంగా '83' విడుదల అవుతున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు బిగ్ స్టార్స్ అయినా థియేటర్లో అలరిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
× RELATED తమిళ అమ్మాయి పాత్రలో మెరవనున్న శర్వానంద్ హీరోయిన్!!
×