మేము చనిపోతామని చాలా మంది అనుకున్నారు

టాలీవుడ్ కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శిల్ప రెడ్డి మహమ్మారి వైరస్ బారిన పడ్డట్లుగా వార్తలు వచ్చిన వెంటనే అంతా కూడా ఆందోళన చెందారు. ఆమె టాలీవుడ్ ప్రముఖులకు అత్యంత సన్నిహితంగా ఉంటారు. ముఖ్యంగా ఆమె టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంత మరియు అక్కినేని ప్యామిలీకి సన్నిహితంగా మెలుగుతారు. వైరస్ విషయం తెలియడానికి కొన్ని రోజుల ముందు కూడా సమంతను ఆమె కలవడం జరిగింది. దాంతో అక్కినేని ఫ్యామిలీ కి వైరస్ భయం ఉందంటూ మీడియా లో ప్రచారం జరిగింది. తాజా గా శిల్ప రెడ్డి ఈ విషయమై మొదటి సారి స్పందించారు.

శిల్ప రెడ్డి మాట్లాడుతూ... వైరస్ ఒక సారి ఎటాక్ అయితే ఇక అంతే.. చనిపోతామేమో అన్నంత భయంను కొందరు జనాలు కలిగి ఉన్నారు. కాని అది వాస్తవం కాదు. మాకు వైరస్ అని తెలిసిన వెంటనే చాలా మంది మేము చని పోతాము అని అనుకున్నారు. మా వద్ద పని చేసే వారు చాలా మంది ఇక మేము చని పోతామేమో అన్నంతగా భయ పడి ఏడ్చారు. కొందరు స్నేహితులు కూడా చాలా బాధ పడ్డారు.
 
సరైన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు రెగ్యులర్ గా ఎక్సర్ సైజ్ లు చేయడంతో వైరస్ ను చాలా త్వరగా జయించాము. వైరస్ ఎటాక్ అయిన సమయంలో ఇమ్యూనిటీ పవర్ ను కాపాడుకోవాల్సి ఉంటుంది. వైరస్ వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది. అప్పుడు సరైన ఆహారం తీసుకుంటూ వ్యాయామం మరియు యోగా వంటివి చేస్తే ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు. నా భర్త నేను ప్రస్తుతం వైరస్ నుండి పూర్తిగా విముక్తి అయ్యామంటూ శిల్ప రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
× RELATED రియా ప్రయాణిస్తున్న కారు ఎవరిది...?
×