భారత్ సరిహద్దులో 423 మీటర్లు చొచ్చుకొచ్చిన చైనా !

గల్వాన్ లోయ లో చైనా సైన్యం భారత్ లోకి 423మీటర్లు చొచ్చుకుని వచ్చినట్లు ఉపగ్రహాల చిత్రాల ద్వారా వెల్లడవుతోంది. 1960లో చైనాయే పేర్కొన్న సరిహద్దు రేఖను దాటి 423మీటర్ల మేర ఆ దేశం దురాక్రమణకు పాల్పడింది. ఆ దేశం తో భారత్ మంగళవారం కమాండర్ స్థాయి చర్చలు జరపనుంది. ఇప్పటి వరకూ జరిగిన రెండు దఫాల చర్చలు సరిహద్దుకు చైనా వైపున ఉన్న మోల్డోలో జరగగా.. తాజా చర్చలు భారత భూభాగం లోని చుల్ షుల్ లో చోటు చేసుకోనున్నాయి.

మొత్తంగా చైనా తీరు చూస్తుంటే... యుద్ధానికి రెచ్చగొడుతున్నట్లే కనిపిస్తోంది. ఓవైపు ఏమీ లేదంటూనే మరో వైపు కయ్యానికి కాలు దువ్వుతోంది. నేటి చర్చలు ఫలవంతమైనా చైనా తీరు మారుతుందనే నమ్మకం ప్రజలకు కలగట్లేదు. సరిహద్దుల నుంచి తమ సైన్యాన్ని వెనక్కి పంపిస్తామని చెప్పిన చైనా... ముందుకి పంపడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఏకంగా చైనా సైన్యం... భారత సరిహద్దుల్లోకి 423 మీటర్లు చొచ్చుకొచ్చారు. ఈ విషయం శాటిలైట్ దృశ్యాల ద్వారా తెలిసింది.

ఇండియా... అమెరికా రష్యాతోపాటూ... తాజాగా జపాన్ తో సత్సంబంధాలు పెంచుకుంటోంది. అత్యంత తాజాగా అమెరికా జపాన్ నావికాదళాలతో కలిసి సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు చేసింది. ఇలా చైనాను అన్ని వైపుల నుంచి భారత్ రౌండప్ చేస్తున్నా డ్రాగన్ తన కుతంత్రాల్ని ఆపట్లేదు.సోషల్ మీడియాలో ఆల్రెడీ చైనాపై పెద్ద యుద్ధమే జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా 59 చైనా యాప్‌లను నిషేధించడాన్ని నెటిజన్లు పెద్ద ఎత్తున సమర్థిస్తున్నారు. దొంగ చైనాకు ఇదే సరైన దెబ్బ అని నెటిజన్లు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు. టిక్‌టాక్ లేకపోతే... కొంపలేమీ మునిగిపోవని ఇంకా ఎన్నో ఉన్నాయ్ అని చెప్తున్నారు.

ఇక మరోవైపు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి ఉంది. చైనాకి చెక్ పెట్టేందుకు ఆర్మీ కమాండోలు సిద్ధంగా ఉన్నారు. జస్ట్ 8 నిమిషాల్లో దాడి చేసేందుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సర్వసన్నద్ధమైంది. నౌకా దళం కూడా యుద్ధ నౌకలతో సిద్ధమైంది. పర్వతాల్లో యుద్ధానికి సంబంధించి భారత్‌కు ఉన్నంత అనుభవం చైనాకు లేదు. లడక్‌లో యుద్ధం వస్తే సుఖోయ్ మిరాజ్ జాగ్వార్ వంటి యుద్ధవిమానాలతో ఇండియా... చైనాపై విరుచుకుపడే అవకాశం ఉంది

ఇదే సమయంలో... నేడు ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనుండటం విశేషం. మొన్న ఆదివారం స్థానికంగా తయారైన వస్తువుల్నే వాడాలని ప్రధాని మోదీ స్వయంగా మరోసారి కోరారు. అంతే కాదు చైనాది దుష్టబుద్ధి అని సంస్కృత శ్లోకం ద్వారా పరోక్షంగా విమర్శించారు.  


× RELATED స్టార్టప్‌ల కోసం గూగుల్ అమెజాన్ లకు చెక్ !
×