ఏపీ లో వైరస్ విజృంభణ... తాజాగా మరో 704 కేసులు

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ రోజురోజుకీ నమోదయ్యే  వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో 648 వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 51మందికి విదేశాల నుంచి వచ్చిన ఐదుగురికి  వైరస్ పాజిటివ్గా నిర్దారణ అయింది. ఈ మేరకు మంగళవారం ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 18114 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం 704 మందికి పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11595కి చేరింది. ఇక గడచిన 24 గంటల్లో 258 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా ఏడుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 187కి చేరింది. ఈ రోజు మృతి చెందిన ఏడుగురిలో కృష్ణా 3 కర్నూలు 2  గుంటూరు అనంతపురంలో జిల్లాలో ఒక్కొక్కరు ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7897 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

× RELATED స్టార్టప్ల కోసం గూగుల్ అమెజాన్ లకు చెక్ !
×