హైదరాబాద్ లో భారీ పేలుడు

ఇప్పటికే కరోనాతో అల్లకల్లోలంగా మారిన హైదరాబాద్ లో తాజాగా భారీ పేలుడు కలకలం రేపింది. మియాపూర్ అల్విన్ చౌరస్తాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో రసాయనాలను తరలిస్తున్న లారీలో ఈ భారీ పేలుడు సంభవించింది.

లారీ పేలడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. సకాలంలో స్పందించిన పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

రాత్రి సమయం కావడం తో జన సంచారం పెద్ద గా లేదు. మరో అర గంట తర్వాత జరిగి ఉంటే భారీ గా ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్థానికులు పేర్కొన్నారు. డ్రైవర్ సమయ స్ఫూర్తి తో ట్రక్కు నుంచి దూకేయడం తో ఎలాంటి ప్రాణ నష్టం జరగ లేదు.
× RELATED స్టార్టప్ల కోసం గూగుల్ అమెజాన్ లకు చెక్ !
×