ఫ్యామిలీ మ్యాన్ అవతారంలో సుధీర్ బాబు

మహమ్మారి దెబ్బకు గత రెండు నెలలుగా ఎక్కువమంది తమ ఇళ్లకే పరిమితమయ్యారు.  సాధారణ ప్రజలే కాదు.. సెలబ్రిటీలు కూడా అందరూ ఫ్యామిలీతో గడుపుతున్నారు.  టాలీవుడ్ హీరో సుధీర్ బాబు కూడా ఈ టైమ్ ను అటు ఫిట్నెస్ పై ఫోకస్ చేయడం ఇటు కుటుంబ సభ్యులతో గడపడానికి కేటాయించారు.  తాజాగా సుధీర్ బాబు ఫ్యామిలి పిక్ ఒకటి బయటకు వచ్చింది.

ఈ ఫోటోలో సుధీర్ బాబుతో పాటుగా ఆయన సతీమణి ప్రియదర్శిని ఘట్టమనేని..  తనయులు చరిత్ మానస్.. దర్శన్ కూడా ఉన్నారు.  సుధీర్ ఈ ఫోటోలో ఓ స్లీవ్ లెస్ టీ షర్టు ధరించి గడ్డం పెంచి కూలింగ్ క్లాసెస్ తో సూపర్ కూల్ గా క్యాజువల్ గా ఉన్నారు.  అందరూ మంచి స్మైలింగ్ ఫేస్ తో కనిపిస్తున్నారు.  ఈ ఫోటో చూస్తుంటేనే సుధీర్ బాబు తన ఫ్యామిలీ మెంబర్స్ తో ఎలా సరదాగా గడుపుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఇక సినిమాల విషయానికి వస్తే నాని తో కలిసి నటించిన 'V' రిలీజుకు రెడీగా ఉంది.  ఈ సినిమాకు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకుడు.  ఈ సినిమాతో పాటుగా పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో కూడా నటిస్తున్నాడు.
× RELATED ఫోటో టాక్ : తనకు తానే కౌగిలింత
×