హీరోను కొట్టిన కియారా.. అదే కారణమా?

బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ శ్రద్దా కపూర్ హీరో హీరోయిన్లుగా గతంలో ఏబీసీడీ-2 సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో వరుణ్ శ్రద్ధా కలిసి 'సున్ సాథియా' అనే పాటలో ఇద్దరు కలిసి స్టెప్పేసారు. అయితే అదే పాటకు ఇటీవలే హీరో వరుణ్ ధావన్ కబీర్ సింగ్ ఫేమ్ కియారా అద్వానీ కలిసి డాన్స్ రిహార్సల్ చేశారు. అయితే సినీ ఇండస్ట్రీలో ఎవరినైనా కొట్టాలని అనిపిస్తే మాత్రం సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇప్పుడు అదే విధంగా హీరోయిన్ కియారా అద్వానీ.. వరుణ్ ని ముక్కుమీద కొట్టిందట. మరి అంత కోపం ఏంటి అమ్మడికి.. వరుణ్ ఏమన్నాడు అసలు అనే సందేహాలు రావచ్చు. కానీ ఆ సందేహాలన్నింటికీ వరుణ్ క్లారిటీ ఇచ్చాడు.

నన్ను ముక్కు మీద కియారా కొట్టింది వాస్తవమే.. కానీ మీరు అనుకుంటున్నట్లు కోపంతో కాదు.. డాన్స్ రిహార్సల్ లో సరదాగా అలా జరిగిందని అన్నాడు. కానీ ఎవరు నమ్మేలా లేరని.. వరుణ్ వీడియో ప్రూఫ్ తో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. వరుణ్ తన సోషల్ మీడియా పేజ్ ద్వారా కియారా అద్వానీ ముక్కు మీద ఉద్దేశ పూర్వకంగా కొట్టిందని తెలిపాడు. ఏబీసీడీ-2 సినిమాలోని సున్ సాథియా సాంగ్ రిహార్సల్లో భాగంగా ఇది జరిగిందని వీడియోని ప్రూఫ్ జతచేసాడు. ఇక ఈ వీడియో వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఈ వీడియోలో వరుణ్ ధావన్ కియారా అద్వానీలు సాంగ్కి అనుగుణంగా చక్కగా డ్యాన్స్ చేశారు. అనుకోకుండా ఓ  స్టెప్ వేసేటప్పుడు కియారా ముక్కుపై కొట్టింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలిపాడు వరుణ్. ఇదిలా ఉండగా ప్రస్తుతం వరుణ్ కియారాలు ఇద్దరు కెరీర్లో బిజీ టైం గడుపుతున్నారు.
× RELATED 'మిడిల్ క్లాస్ మెలోడీస్' అంటున్న దేవరకొండ...!
×