తెలుగు రాష్ట్రాల్లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తెలంగాణలో ఈ రోజు రికార్డ్ స్థాయిలో 117 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రంలో వెలుగు చూసిన కేసులు 66 కాగా - వేరే రాష్ట్రాల నుండి తెలంగాణకు వచ్చిన వారికి ఇద్దరికి - సౌదీ అరేబియా నుండి వచ్చిన 49 మందికి కరోనా పాజిటివ్ తేలినట్లు వైద్య - ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో తెలంగాణలో మొత్తం కేసులు 2256కు చేరుకున్నాయి. ఇందులో 844 కేసులు యాక్టివ్ కాగా - 134 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరణాలు 67గా ఉన్నాయి. తెలంగాణలో నిన్న కూడా కరోనా కేసులు 107 నమోదయ్యాయి.

ఏపీలోను కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో 54 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2841కి చేరుకుంది. మరణాలు 59కి చేరుకున్నాయి. డిశ్చార్జ్ అయిన బాధితుల సంఖ్య 1958కి చేరుకుంది. యాక్టివ్ కేసులు 824గా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుండి - విదేశాల నుండి వచ్చిన కేసులు కలిపితే 3245కు చేరుకున్నాయి.

ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ రోజు 6850 కేసులు నమోదయ్యాయి. 139 మరణాలు నమోదయ్యాయి. తమిళనాడు - పశ్చిమ బెంగాల్ - కేరళలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇండియాలో కరోనా కేసులు 164936 పెరిగి జాబితాలో 9వ స్థానంలో ఉంది. మొత్తం మరణాలు 4673. రికవరీ అయిన వారి సంఖ్య 70102. యాక్టివ్ కేసులు 90161. ప్రతి 10 లక్షల మందిలో సగటున 2439 మందికి టెస్టులు నిర్వహించారు.
   


× RELATED వల్లభనేని ఈ నెలలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా?
×