బ్రేకింగ్: కన్నా కోడలు అనుమానాస్పద మృతి

ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పద మృతి కలకలం రేపింది. కన్నా చిన్న కుమారుడు ఫణేంద్ర భార్య సుహారిక అనుమానాస్పద స్థితిలో మరణించడం సంచలనమైంది.

హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీనాక్షి టవర్స్ లో గురువారం సాయంత్రం ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

సంఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కోడలు మృతితో కన్నా కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.

× RELATED జగన్ నిర్ణయంతో కేసీఆర్ పై ఒత్తిడి!
×