ఏపీలో వైరస్ కల్లోలం.. ఒకరి నుండి 80 మందికి !

వైరస్ దేశంలో  ఎలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైనాలో పుట్టిన మరో వైరస్ గత ఐదు నెలలుగా ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తుంది.ఈ వైరస్ ను నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. ఇకపోతే  మన దేశంలో కూడా ఈ వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు అత్యంత దారుణంగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దీన్ని అరికట్టడానికి లాక్ డౌన్ ను కొనసాగిస్తూ ఉన్నప్పటికీ వైరస్ అదుపులోకి రావడం లేదు.

ఈ సమయంలో ఏపీలో జరిగిన ఓ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఏపీ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఒక వ్యక్తి ద్వారా 80 మంది వైరస్ సోకిందట.  పెదపూడి మండలం జి.మామిడాడ గ్రామానికి చెందిన 53 ఏళ్ల వ్యక్తి .. ఈ నెల 21న కాకినాడ కేజీహెచ్ లో వైరస్ కారణంగా చేరి ..చేరిన రోజే మరణించారు. అయితే అతని ద్వారా 80 మందికి వైరస్ సోకింది. జిల్లాలో బుధవారంనాటికి 160 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో సగం ఆ వ్యక్తి అనుబంధంగా నమోదైన ఇవే కావడం గమనార్హం. ఆ వ్యక్తి నుంచి పెదపూడి బిక్కవోలు రామచంద్రపురం మండపేట అనపర్తి మండలం లోని 80 మందికి కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
× RELATED రెండు ముక్కలైన విమానంలో నుంచి నిప్పు రాజుకోలేదెందుకు?
×