లాక్ డౌన్ వేళ..చర్చిలో పాస్టర్ రాసలీలలు

లాక్ డౌన్ టైంలో దేేవాలయాలు - మసీదులు - చర్చిలు అన్నీ మూతపడిపోయాయి. రెండు నెలలుగా ఏవీ తెరుచుకోలేదు. జనాలు అసలు బయటికే అడుగు పెట్టనపుడు గుళ్లూ గోపురాలకు ఎందుకు వెళ్తారు. ఇదే అదనుగా భావించి ఓ పాస్టర్.. చర్చిని శృంగార కార్యకలాపాలకు వేదికగా మార్చుకున్నాడు. ఓ భక్తురాలిని వశపరుచుకుని ఆమెను చర్చికి రప్పించి తన కామ వాంఛలు తీర్చుకున్నాడు. కేరళలో వెలుగులోకి వచ్చిందీ సంచలన ఉదంతం. కేరళలోని ఇడుక్కి జిల్లాలోని వెల్లాయుంకూడి అనే ప్రాంతంలోని క్యాథలిక్ చర్చిలో ఫ్రెడరిక్ జేమ్స్ మంగలాచెరీ అనే పాస్టర్.. లాక్ డౌన్ టైంలో చర్చిలో నడిపిన రాసలీలలకు సంబంధించి ఫొటోలు బయటికి వచ్చాయి.

సమస్యల్లో ఉన్న ఓ మహిళను ప్రేయర్ కోసమని చర్చికి రప్పించి ఆమెను వశపరుచుకుని ఆమెతో జేమ్స్ శృంగార కార్యకలాపాల్లో మునిగి తేలినట్లు వెల్లడైంది. సదరు మహిళతో ఆయన నగ్నంగా నగ్నంగా ఉన్న ఫొటోలు అనుకోకుండా బయటికి వచ్చేశాయి. ఆ ఫొటోలు పాస్టరే స్వయంగా తీసినవని వాటి తీరు చూస్తుంటే అర్థమవుతోంది. మరి ఆయన ఫోన్ నుంచి ఎవరు ఈ ఫొటోల్ని బయటికి తీశారు.. అన్నది తెలియడం లేదు. క్రిస్టియన్లు భారీ సంఖ్యలో ఉండే కేరళలో ఈ ఉదంతం సంచలనం రేపింది. చర్చి పెద్దలు ఆయనపై చర్చలకు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంతో ఆ పాస్టర్ పరువంతా పోయింది. సదరు మహిళ ఫొటోలను నెటిజన్లు బ్లర్ చేయకుండా సోషల్ మీడియాలో పెట్టేస్తుండటమే దారుణమైన విషయం.


× RELATED వల్లభనేని ఈ నెలలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా?
×