పోలీసులకి స్వీట్స్ పంచిన ఆర్మీ అధికారి ...ఎందుకంటే ?

ఏదైనా ఆపద వచ్చిన సమయంలో రియల్ హీరోలు వెలుగులోకి వస్తుంటారు. అయితే మన దేశ రక్షణలో ప్రతి క్షణం నిమగ్నమై ఉండే సైనికులే మన రియల్ హీరోలు. దేశ రక్షణ కోసం పగలు రాత్రి ఎండ వాన ఏవి చూడకుండా అహర్నిశలు ప్రాణాలు పణంగా పెట్టి కాపు కాస్తుంటారు.ప్రస్తుతం దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించడానికి నిరంతరం కృషి చేస్తున్న వైద్యులు కూడా హీరోలే కేవలం వైద్యులు మాత్రమే కాదు నర్సులు ల్యాబ్ టెక్నీషియన్లు వైద్య రంగంలో ప్రతి ఒక్కరూ వైరస్ వారియర్స్ గా పరిగణిస్తారు. ఆర్మీ హెలికాప్టర్లతో వైరస్ వారియర్స్ అయిన వైద్య సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది.

కానీ ఈ కష్ట కాలంలో ప్రాణాలకి తెగించి విధి నిర్వహణలో పాల్గొంటున్న పోలీసు శాఖను చాలామంది మరచిపోయారు. ఈ క్లిష్ట పరిస్థితిలో పోలీసు శాఖ సేవలను మరచిపోకూడదు. లాక్ డౌన్ ను సరిగ్గా అమలు చేయడంలో పోలీసుల పాత్ర చాలా ఉంది. ఇంట్లో ఉన్న ప్రజల మాదిరిగానే వారు తమ కుటుంబాన్ని మరచి వీధుల్లోకి వచ్చారు. కొన్ని చోట్ల ప్రజలను నియంత్రించడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ కూడా చేసారు. ఈ చర్యను కొందరు విమర్శించినప్పటికీ ఇటువంటి చర్యలు మహమ్మారి నివారణలో భాగంగా జరిగినవే. ఈ తరుణంలో పోలీసు శాఖ నిస్వార్థ సేవను భారత సైన్యం ప్రశంసించింది.

లాక్ డౌన్ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై దేశం మొత్తం గర్వంగా ఉందని పోలీసులపై ప్రశంసలు కురిపించారు ఓ ఆర్మీ అధికారి. ఆ తరువాత అక్కడి పోలీసులందరికీ స్వీట్ బాక్స్ లు పంచిపెట్టారు. భారత సైన్యం పోలీసులకు స్వీట్లు తయారు చేశారు. పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపేందుకు అన్ని పోలీసు చెక్ పోస్టులను సందర్శిస్తానని ఆ ఆర్మీ అధికారి తెలిపారు. ఈ సంఘటన రాజస్థాన్లో జరిగింది.
× RELATED పాల బుగ్గల హన్సిక కవ్వింత తుళ్లింత!
×