కేసీఆర్ హెలికాప్టర్ మనీ ఐడియా..ఆ దేశం పాటిస్తోంది!

సీఎం కేసీఆర్ ఏ మూహూర్తాన హెలికాప్టర్ మనీ అన్నాడో అప్పటి నుంచి దీనిపై చర్చ మొదలైంది. మహమ్మారి లాక్ డౌన్ లతో కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి ఆర్బీఐ-కేంద్రం నగదును ముద్రించి నేరుగా ప్రభుత్వాలకు డబ్బును పంచడాన్నే ‘హెలికాప్టర్ మనీ’ అంటారు. అంటే నోట్లు ముద్రించి అవసరాలకు వాడుకోవడం అన్నమాట.. ఇలా చేస్తే ద్రవ్యోల్బణం పెరిగి రూపాయి విలువ పడిపోతుందని.. ధరలు పెరిగిపోతాయని కేంద్రం భయపడుతోంది. కర్సెనీకి విలువ ఉండదని కేంద్రం నో చెప్పింది.

అయితే కేసీఆర్ ఐడియాను కేంద్రంలోని మోడీ సర్కార్ పాటించకపోయినా.. ఈ మహమ్మారి సంక్షోభంతో కుదేలైన న్యూజిలాండ్ దేశం మాత్రం ఈ హెలికాప్టర్ మనీ ఐడియాను అమలు చేయాలని భావిస్తోంది.

న్యూజిలాండ్ ప్రభుత్వం తమ దేశ ప్రజలకు నేరుగా హెలికాప్టర్ మనీ ద్వారా డబ్బులు ఇవ్వాలని అనుకుంటోంది. లాక్ డౌన్ కారణంగా చితికిపోయిన ప్రజలను ఆదుకోవడానికి ఈ నిర్ణయం తీసుకోక తప్పదంటోంది.

లాక్ డౌన్ మహమ్మారి దెబ్బకు న్యూజిలాండ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది. దీని నుంచి బయటపడేందుకు ఆర్థిక ప్యాకేజీతోపాటు హెలికాప్టర్ మనీతో తమ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే ఈ మేరకు అమలు చేయాలని చూస్తోంది.
× RELATED షాకింగ్... శ్రామిక్ రైళ్లలో 80 మంది వలస కూలీలు మృతి
×