హీరోయిన్ ని చంపేసిన సోషల్ మీడియా

పాకిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం జరిగి 99మంది  మరణించడం విషాదం నింపింది. జనావాసాలపై కూలిపోవడంతో స్థానికులు కూడా మరణించారు. ఇప్పటికే ఈ ఫొటోలు వీడియోలు వైరల్ అయ్యాయి. ఎవరెవరు మృతి చెందారనే దానిపై వార్తలు ప్రచారం అయ్యాయి.

అయితే సోషల్ మీడియాలో తాజాగా ఈ విమాన ప్రమాదంలో పాకిస్తాన్ నటి అయేజా ఖాన్ ఆమె భర్త కూడా మృతి చెందినట్లు వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.దీంతో పాకిస్తాన్ సినీ రంగం దిగ్భ్రాంతికి గురైంది.

చాలా మంది అభిమానులు సినిమా ప్రముఖులు కంగారు పడి అందరూ ఆరాతీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో తనను చంపేయడంపై స్వయంగా అయేజాఖాన్ స్పందించారు.

‘‘దయచేసి ఇలాంటి అసత్య వార్తలను ప్రచారం చేయొద్దని.. తాను తన భర్త క్షేమంగానే ఉన్నామని’’ తాజాగా సోషల్ మీడియాలో అయేజా ఖాన్ పోస్ట్ పెట్టింది. దీంతో విమాన ప్రమాదంలో ఈ హీరోయిన్ మృతి చెందిందన్న వార్త ఉట్టి ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. దీంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
× RELATED ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం నుంచి ఏం నేర్వాలి?
×