డాక్టర్ సుధాకర్ కేసు ...హైకోర్టు తీర్పు పై ఆమంచి ఆగ్రహం !

ఏపీలో డాక్టర్ సుధాకర్ కేసుతో రాజకీయ దుమారం రేగుతుంది. డాక్టర్ సుధాకర్ కేసు విచారణ బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ నాయకుడు చీరాల మాజీ ఎమ్మె ల్యే ఆమంచి కృష్ణమోహన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు నిర్ణయంపైనే ఆయన వ్యాఖ్యలు చెయ్యటం ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది. అలాగే ఈ మధ్య కాలంలో కోర్టు తీర్పుల పై ఈ లెవెల్ ఎవరు కూడా ఆగ్రహం వ్యక్తం చేయలేదు. సహజంగానే కాస్త దూకుడుగా వ్యవహరించే ఆమంచి హైకోర్టు తీర్పుపై తన సహజ ధోరణిలో విమర్శలు గుప్పించారు.

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాలలో వేడుకలు నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా ఆమంచి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ సుధాకర్ కేసులో సుధాకర్ తరపున వేసిన పిటీషన్ ను సమర్ధిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వటం సమంజసం కాదని ఇది ఒక పెట్టీ కేసు అని ఇక దీనిని సీబీఐ కి అప్పగిస్తారా అని ఆమంచి కృష్ణ మోహన్ వ్యాఖ్యానించారు. ఇక డాక్టర్ సుధాకర్ కేసు సీబీఐ కి అప్పగించటంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బ తిన్నాయని ఇలా ప్రతి చిన్న కేసును సీబీఐకి అప్పగిస్తే ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర కేంద్రం సీబీఐ ఆఫీస్ ఏర్పాటు చెయ్యాల్సి వస్తుందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కోర్టు తీర్పులను ప్రశ్నించకూడదని కానీ ఇలాంటి తీర్పులతో న్యాయస్థానాలపై నమ్మకం పోతోందని ఆయన తీవ్ర వ్యాఖ్య చేశారు. అంతేకాదు కరోనా లేకపోతే హైకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ఆందోళన చేసి ఉండేవాడినని ఆయన చెప్పుకొచ్చారు. సహజంగా ఎవరైనా కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పుకు కట్టుబడే ఉండాలి. ఒకవేళ తీర్పులు అనుకూలంగా లేకున్నా సరే పై కోర్టులకు అప్పీల్ చేసుకుంటారే గానీ ఎవరూ ఈ తరహా వ్యాఖ్యలు చెయ్యరు కానీ దానికి భిన్నంగా ఇప్పుడు ఆమంచి వ్యాఖ్యలు చేయడం అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది.
× RELATED షాకింగ్... శ్రామిక్ రైళ్లలో 80 మంది వలస కూలీలు మృతి
×