డైరెక్టర్ 'వక్కంతం'కి నో స్టార్ హీరో!

టాలీవుడ్లో ప్రస్తుతం పాపులర్ ఫిల్మ్ రైటర్లలో ఒకరు వక్కంతం వంశీ. అల్లు అర్జున్ తో తెరకెక్కించిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' ఆయనకు దర్శకుడిగా మొదటి సినిమా. ఆ సినిమా రిజల్ట్ పక్కన పెడితే వంశీకి దర్శకుడిగా మంచి పేరు తీసుకొచ్చింది. ఇక ప్రస్తుతం దర్శకుడిగా రెండో సినిమా రూపొందించడానికి సన్నద్ధం అవుతున్నాడు. ఫస్ట్ సినిమా ఫెయిల్ అవ్వడంతో రెండో సినిమాను చాలా శ్రద్ధ పెట్టి రాస్తున్నారట. అయితే ఇటీవలే మాస్ రాజా రవితేజకు ఓ స్టోరీ లైన్ వినిపిస్తే.. రవితేజ బాగుందని చెప్పి పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయుమని చెప్పాడట. ఇక అప్పటి నుండి స్క్రిప్ట్ పనిలో మునిగి తేలుతున్నాడు వంశీ. ఇక ఇండస్ట్రీలో ఎందరో స్టార్ హీరోలతో స్టార్ డైరెక్టర్లతో పనిచేసిన వంశీ.. తన కెరీర్లో చాలా పెద్ద బిగ్గెస్ట్ హిట్ సినిమాలకు కథలు అందించారు.

అయితే మాస్ రాజా రవితేజతో పనిచేయడం వంశీకి కొత్తేమి కాదు. ఎందుకంటే ఇదివరకే ఆయన సినిమాలకు రైటర్ గా పనిచేసాడు. ఆయన కెరీర్లో కిక్ కిక్2 సినిమాలకు కథలు అందించి స్టార్ రైటర్ గా మారిపోయారు. కానీ దర్శకుడిగా రవితేజతో పనిచేయడం వంశీకి ఇదే ఫస్ట్ టైమ్. అయితే వంశీ రాసిన కిక్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆ సినిమా హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా కిక్ పేరుతో రూపొంది వందల కోట్లు వసూల్ చేసింది. అయితే ప్రస్తుతం వంశీ రాస్తున్న స్క్రిప్ట్ రవితేజ కెరీర్లో టాప్ గా నిలవనుందని టాక్. తాజా సమాచారం ప్రకారం.. వంశీ రాసిన స్క్రిప్ట్ రవితేజ కంటే ముందు హీరో నానికి వినిపించినట్లు టాక్. అయితే కథ విన్నాక నాని.. ఈ కథ నాకు సూట్ అవ్వదు అని తేల్చేశాడట. ఇక వెంటనే వంశీ.. రవితేజ కలిసినట్లు ఓ పుకారు హల్చల్ చేస్తుంది. మరి వంశీ మాస్ రాజాతో అయినా బ్లాక్ బస్టర్ కొడతాడేమో చూడాలి. ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
× RELATED 'స‌ర్కార్ వారి పాట' మ‌హేష్ లుక్ వెన‌క మ‌ర్మం?
×