బట్టలు ఉతకడం కష్టం.. కానీ మొగుడిని..!

దేశంలో లాక్ డౌన్ కంటిన్యూ కావడంతో సామాన్యులు సెలబ్రటీలు అనే తేడా లేకుండా అందరికీ బోర్ కొడుతోంది. సెలబ్రిటీల విషయానికొస్తే సోషల్ మీడియాలో వీడియోలు చిట్ చాట్లతో టైంపాస్ చేస్తున్నారు. నటీనటులంతా సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయారు. తెలుగు టీవీ యాంకరింగ్ బిగ్బాస్ వంటి కార్యక్రమాలతో బుల్లితెర ప్రేక్షకులకు చేరువైన శ్యామల. ఈ మధ్య కాలంలో అడపాదడపా సినిమాలలో కూడా కనిపిస్తుంది. యాంకర్ గా.. క్యారెక్టర్ నటిగా బిజీ అయిన శ్యామల ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయింది. ఇక తను కూడా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన క్వారంటైన్ లైఫ్ గురించి ముచ్చటించి.. తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది. తన క్వారంటైన్ లైఫ్ గురించి.. మాట్లాడుతూ.. ‘ఈ క్వారంటైన్ మొత్తం గిన్నెల తోముడు.. రెండు పూట్ల వండుకుని తినడంలాగే ఉంది" అంటుంది యాంకర్ శ్యామల.

పిల్లలకు వండి పెట్టడం.. అప్పుడప్పుడు ఫస్ట్రేషన్ అంతా మొడుగుపై చూపించడం.. గట్టిగా అరుచుకోవడం.. కొట్టుకోవడం మళ్లీ.. సారీ చెప్పుకొని సర్దుకుపోవడం జరుగుతుంది. ఈ క్వారంటైన్లో ఇద్దరి మధ్య నాకు నా భర్తకు బాగానే గొడవలు జరిగాయి. ముఖ్యంగా గిన్నెల విషయంలో.. ఎప్పుడూ గిన్నెలు నేను కడగాలా? అంటూ గొడవ మొదలు.. అప్పటి నుంచి నా మొగుడు బాగానే సహాయం చేస్తున్నాడు. మొదట్లో అతి ప్రేమ చూపించి పాపం నువ్వేం చేస్తావ్ లే.. వద్దులే అని నేనే అన్నాను. తర్వాత మళ్లీ నేనే అరిచా.. నేనే హెల్ప్ చేయమని అడిగా.. ఇంట్లో ఖాళీగా ఉంటే బుర్ర పిచ్చెక్కిపోతుందని ఈ క్వారంటైన్లోనే తెలుసుకున్నాను" ఇంకా ఇల్లు ఊడ్చి.. ఇంటి పనులు చేసుకొని.. బట్టలు ఉతుక్కోవడం పెద్ద సమస్య అయింది. నేను అసలు వాషింగ్ మిషన్ వాడను. చిన్నప్పటి నుండి అలవాటు.. స్వయంగా ఉతుక్కోవడం.. అంటూ శ్యామల సరదాగా సెలవిచ్చింది.
× RELATED ఆచార్యలో చరణ్ కి జోడి దొరికేసిందట!
×