ఒక్క వీడియో గిఫ్ట్ ఇవ్వనందుకు బాధగా ఉంది: స్టార్ హీరో

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న అభిమానులతో పాటు సెలబ్రిటీల నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 'ఆర్ఆర్ఆర్' సినిమా బృందం ఏదైనా ఎన్టీఆర్ సర్ప్రైజ్ వీడియో లేదా ఫస్ట్ లుక్ విడుదల చేస్తుందని అభిమానులంతా కోటి ఆశలతో ఎదురు చూసినందుకు తీవ్ర నిరాశ తప్పలేదు. టీజర్ లాంటి వీడియో ఫస్ట్ లుక్ పోస్టర్ రూపొందించడం వీలు కాలేదని.. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఎలాంటి టీజర్ రిలీజ్ చేయడం లేదని ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ ప్రకటించి షాక్ ఇచ్చారు. తర్వాత ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశించి.. "మీ ఆనందం కోసం ఫస్ట్ లుక్-టీజర్ సిద్ధం చేయాలని చిత్రబృందం ఎంత శ్రమించిందో నాకు తెలుసు. కానీ ఓ ప్రమోషనల్ వీడియో మీ ముందు ఉండాలంటే అన్ని సాంకేతిక విభాగాలు సమన్వయంతో పనిచేయాలి. లాక్ డౌన్ కారణంగా అది సాధ్యపడలేదు.

అందుకే ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి ఎలాంటి ఫస్ట్ లుక్ టీజర్ విడుదల కావడం లేదు' అంటూ సోషల్ మీడియాలో తెలిపారు. అయితే తమ అభిమానులు ఉరుకోరుగా.. ట్విట్టర్ ద్వారా అభిమానాన్ని చాటుకున్నారు. అభిమానులు చూపించిన ప్రేమకు ఎన్టీఆర్ ముగ్దుడయ్యాడు. ‘ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘‘మీరు నా మీద చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది. అన్నింటా నాకు తోడుగా వస్తున్న మీరే నా బలం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని అవగలను? చివరి దాకా మీకు తోడుగా ఉండటం తప్ప.. నా ప్రియమైన అభిమానులారా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను’’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఇక తాజాగా.. నా పుట్టినరోజున అభిమానులు కోరిన చిన్న కోరికను తీర్చలేనందుకు చాలా చింతిస్తున్నాను.. ఒక వీడియో కూడా మీకు అందించలేక పోయాను.. అంటూ ఎమోషనల్ అయ్యాడట.
× RELATED అమ్మికి పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. ముద్దులాట ఓ లెక్కా!
×