లక్షల్లో వైరస్ కేసులు..లాక్ డౌన్ ను వ్యతిరేకిస్తున్న దేశ అధ్యక్షుడు!

మహమ్మారి వైరస్ అమెరికాతో పాటు బ్రెజిల్ పై తీవ్రంగా విజృంభిస్తోంది. ఆ దేశంలో ఈ వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. అమెరికా - రష్యా తరువాత ఇప్పుడు బ్రెజిల్ తీవ్రంగా ప్రభావితమవుతోంది. బ్రెజిల్ లో ఇప్పటివరకు 330890 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే మృతులు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. ఆ దేశంలో 24 గంటల్లో 1001 మంది మరణించారు. కేవలం నాలుగు రోజుల్లో వెయ్యి మందికి పైగా మృత్యు బాట పట్టారు. మొత్తం ఈ దేశంలో మరణాలు 21116 ఉన్నాయి.

కేసుల విషయంలో బ్రెజిల్ అమెరికా - బ్రిటన్ - ఇటలీ - స్పెయిన్ - ప్రాన్స్ దేశాల తరువాత నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటులో బ్రెజిల్ ఆరో స్థానంలో ఉంది. కేసులు ఇన్నేసి పెరుగుతుంటే బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్స్ నారో మాత్రం ఆ వైరస్ ను చిన్నపాటి జ్వరంగా పేర్కొంటున్నారు. దేశంలో తీవ్రంగా వైరస్ వ్యాపిస్తున్నా లాక్ డౌన్ అమలు చేయడం లేదు. లాక్డౌన్ ను ఆయన వ్యతిరేకిస్తున్నారు.  రాష్ట్రాలు - స్థానిక అధికారులు జారీ చేస్తున్న ‘స్టే హోమ్’ ఉత్తర్వులతో ఫలితం లేదని - ఇవి అనవసరంగా ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తున్నాయని అధ్యక్షుడు చెబుతున్నారు. ఆయన నిర్లక్ష్య వైఖరికి దేశం మహమ్మారి వైరస్ కు బలవుతోంది. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున నష్ట పోతున్నారు. అధ్యక్షుడి తీరుపై ఆ దేశంలో ఆందోళనలు రేకెత్తుతున్నాయి.
× RELATED షాకింగ్... శ్రామిక్ రైళ్లలో 80 మంది వలస కూలీలు మృతి
×