మోడీకి మోహమాటం లేకుండా చెప్పండి

ప్రధాని నరేంద్రమోడీ ఏరికోరి తెచ్చుకున్న గుజరాతీ ఆఫీసర్ శక్తికాంత దాస్ ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ గా ఉన్నారు. తాజాగా మోడీ సర్కార్ కు మద్దతుగా భారీ ప్యాకేజీలు ఉద్దీపనలు నిర్ణయాలు తీసుకుంటూ దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదితున్నారు.

అయితే తాజాగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. భారతదేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) ఈ సంవత్సరం తగ్గిపోతోందని.. ఒక ప్రభుత్వ ప్రతినిధి ఆర్బీఐ గవర్నర్ ఇలా ప్రకటించడం దేశ చరిత్రలోనే తొలిసారి. వైరస్ లాక్ డౌన్ ఆందోళన మధ్య భారత ఆర్థిక వ్యవస్థ నెగెటివ్ జోన్ లోకి జారిపోవడం ఖాయమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రెపోరేటును 4.0 శాతానికి తగ్గించారు.

ఈ నేపథ్యంలోనే కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి - కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తాజాగా ఆర్బీఐకి కీలక సూచన చేశారు. ఆర్బీఐ సత్వర చర్యల్ని ప్రశంసించారు. అయితే తమ కర్తవ్య నిర్వహణపై మోడీ ప్రభుత్వానికి నిర్మొహమాటంగా చెప్పాలని కీలక సలహా ఇచ్చారు. తమ డ్యూటీ తమను చేసుకోనివ్వమని మొహమాటం లేకుండా మోడీ సర్కార్ కు గట్టిగా చెప్పాలని సూచించారు. డిమాండ్ పడిపోతుందని.. వృద్ధి పడిపోతుంటే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఎందుకు ద్రవ్యలభ్యతను సమకూరుస్తున్నారంటూ ట్వీట్ లో ప్రశ్నించారు.

జీడీపీలో 1శాతం కంటే తక్కువగా ఉన్న ప్యాకేజీపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మోడీ ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతున్నారని చిదంబరం విమర్శించారు. ఆర్థిక వ్యవస్థను పతనం చేస్తున్నారని మండిపడ్డారు.
× RELATED షాకింగ్... శ్రామిక్ రైళ్లలో 80 మంది వలస కూలీలు మృతి
×