మన్మథుడితో సెన్సిబుల్ డైరెక్టర్ కొత్త సినిమానా..?

టాలీవుడ్ లో 'ఆనంద్ ఓ మంచి కాఫీ లాంటి సినిమా'తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు శేఖర్ కమ్ముల. ఆ సినిమా తర్వాత హ్యాపీ డేస్.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.. లీడర్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుని సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఇక 2017లో విడుదలైన ఫిదా సినిమాతో నిజంగానే తెలుగు రాష్ట్రాలను ఫిదా చేసేసాడు శేఖర్. ప్రస్తుతం ఆయన అక్కినేని నాగచైతన్య - సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా 'లవ్ స్టోరీ' అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి స్పందనతో సినిమా పైన అంచనాలను క్రియేట్ చేసాయి. నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ నెల ఫస్ట్ హాఫ్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు.

కానీ కరోనా వల్ల థియేటర్లు మూతపడటంతో కుదరలేదు. అయితే ఈ లవ్ స్టోరీ సినిమా పూర్తికావడానికి ఇంకా 15 రోజుల షూటింగ్ మిగిలి ఉందట. ఇది పూర్తి కాకముందే తన తర్వాత సినిమాను కూడా ఫిక్స్ చేశాడు శేఖర్ కమ్ముల. తన తదుపరి సినిమా కూడా ''లవ్ స్టోరీ'' సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్ నారాయణ్ దాస్ నారంగ్ నిర్మిస్తుండటం విశేషం. లవ్ స్టోరీ మూవీ కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో.. శేఖర్ కమ్ముల పనితనం నచ్చి ప్రొడ్యూసర్ నారాయణ్ దాస్ నారంగ్ తమ తరవాత సినిమా కూడా శేఖర్ కమ్ములనే చేయాలనీ కోరాడట. అయితే దీనికి శేఖర్ కమ్ముల కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. అయితే ఆ సినిమాలో ఓ స్టార్ హీరో నటించనున్నాడని సమాచారం.. ఆ హీరో కూడా తన లాస్ట్ సినిమా ప్లాప్ అందుకున్నాడని టాక్.

అంటే మెగాస్టార్ అంటే ఆచార్య - లూసిఫెర్ లతో బిజీ.. బాలయ్య బోయపాటి ఫిక్స్.. వెంకీ నారప్ప.. అందరూ దాదాపు బిజీ ఉన్నారు. కానీ ఓ సెన్సిబుల్ హీరో అనే అంటున్నారు. కానీ మన్మధుడు నాగ్ అని సినీ వర్గాలలో టాక్ నడుస్తుంది. మరి గతంలో నాగ్ కూడా శేఖర్ కమ్ముల మూవీస్ చాలా ఇష్టమని చెప్పినట్లు దాఖలాలు ఉన్నాయి. మరి శేఖర్ - నాగ్ ఇద్దరు సెన్సిబుల్ జోడి అవుతారని సమాచారం. అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట. లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అవ్వగానే ఈ మూవీ పట్టాలెక్కనుంది. అయితే నెక్స్ట్ సినిమా కూడా శేఖర్ కమ్ముల స్టైల్లోనే సాగుతుందని తెలుస్తోంది. ఈ మూవీ గురించి మిగతా విషయాలు త్వరలో తెలియజేయనున్నారు.× RELATED అమ్మికి పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. ముద్దులాట ఓ లెక్కా!
×