'ఏంటి బావా నీకు పెళ్లంట?' ట్వీట్ పై యువ హీరోల ఫన్నీ కామెంట్స్..!

ప్రస్తుతం ఇళ్లల్లో ఖాళీగా ఉంటున్న సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తున్నారు. కొంతమంది సెలబ్రెటీలు పెళ్లిళ్లు అనౌన్స్ చేస్తూ బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి ఓ ఇంటివారు అవుతున్నారు. ఇప్పటికే యంగ్ హీరో నిఖిల్ పెళ్లి చేసుకొని ఓ ఇంటి వాడు కాగా.. మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్ రానా కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ప్రకటించాడు. ఇక ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసేసుకున్న నితిన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో పెళ్లీడుకొచ్చిన యువ హీరోలంతా ఇప్పుడు పెళ్లిళ్లపై సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. దీంతో మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లికి సంబంధించి కూడా వార్తలు వినిపించాయి. అయితే నాగబాబు వరుణ్ తేజ్ పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చారని.. వచ్చే ఏడాది నిహారిక పెళ్లి చేసిన వెంటనే వరుణ్ తేజ్ కు కూడా పెళ్లి చేస్తానంటూ తెలిపారని న్యూస్ వచ్చింది.

అయితే ఈ వార్తలపై సాయిధరమ్ తేజ్ ఫన్నీ ట్వీట్ చేసాడు. దీనిపై వరుణ్ తేజ్ ను ప్రశ్నిస్తూ నాగబాబు పెళ్లి వార్తల గురించి మాట్లాడినట్టుగా ఓ యూట్యూబ్ ఛానల్ లో వచ్చిన వార్తల స్క్రీన్ షాట్ షేర్ చేసాడు. ''ఏంటి బావా నీకు పెళ్లంటా'' అంటూ క్వశ్చన్ చేశారు. ఈ ట్వీట్ చూసిన తమన్.. ''నిజమా'' అంటూ ప్రశ్నించారు. తేజ్ ట్వీట్ కి వరుణ్ కూడా సమాధానం ఇచ్చారు. ''దానికి చాలా టైమ్ ఉందిలే కానీ.. మన రానా - నితిన్ మాత్రం ఫర్ ఎవర్ విత్ యూ అంటూనే సింపుల్ గా సింగిల్ గ్రూప్ నుండి ఎగ్జిట్ అయిపోయారు'' అంటూ ఫన్నీ ట్వీట్ చేశాడు వరుణ్ తేజ్. దీనిపై తాజాగా నితిన్ స్పందించాడు. ''బాధ పడకండి బ్రోస్.. ఆప్ కా నెంబర్ బీ ఆయేగా.. అవన్నీ కాదు కానీ అప్పుడెప్పుడో నా బర్త్ డేకి గిఫ్ట్ ఇస్తా... లాక్ డౌన్ వల్ల ఆగిపోయా అన్నావు.. సాయి ధరమ్ తేజ్ డార్లింగ్ వేర్ ఈజ్ మై గిఫ్ట్.. ఎప్పుడిస్తున్నావ్.. ఐయామ్ వెయిటింగ్ అంటూ'' నితిన్ ట్వీట్ చేశాడు.

అంతేకాకుండా వీరి సరదా ట్వీట్స్ పై వెన్నల కిషోర్ కూడా స్పందించి..''ఫరెవర్ సింగిల్: సింగిల్స్ రాక్: హ్యాపీలీ సింగిల్: సింగిల్ ఈజ్ ది న్యూ బ్లాక్: హౌస్ ఆఫ్ సింగిల్స్: గేమ్ ఆఫ్ సింగిల్స్: బిగ్ సింగిల్ థియరీ మొదలైన వాటి కంటే ‘దానికి చాలా టైమ్ ఉండి’ అనేది నమ్మొచ్చు'' అంటూ ట్వీట్ చేసాడు. దీనికి నితిన్ స్పందిస్తూ.. ''నీకేముంది డార్లింగ్.. పెళ్లయిపోయింది కాబట్టి ఎన్నైనా డైలాగ్స్ కొడతావ్. పంచస్ వేస్తావ్'' అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. మొత్తం మీద టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ సరదా సరదా ట్వీట్లు చేసుకుంటూ ఫ్యాన్స్ కు సోషల్ మీడియాలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారని చెప్పవచ్చు. అయితే సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్ కి నెటిజన్స్ సరదా కామెంట్స్ పెడుతున్నారు. వరుణ్ తేజ్ వయస్సు 30.. సాయిధరమ్ తేజ్ వయస్సు 33.. అంటే ఏ మెగా హీరో ముందు పెళ్లి చేసుకోవాలి అంటూ ప్రశ్నిస్తున్నారు.
× RELATED అమ్మికి పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. ముద్దులాట ఓ లెక్కా!
×