రంజాన్ ఉపాధి పై వైరస్ దెబ్బ ..కళ తప్పిన పాతబస్తీ !

రంజాన్ ..ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండుగ. రంజాన్ అంటే కేవలం ఏడాదికి ఒకసారి వచ్చే పండుగ మాత్రమే కాదు కొన్ని వేల కుటుంబాల కడుపు నింపే ఉపాధి. ఆ నెల రోజులు ఓల్డ్ సిటీలో ఉండే సందడి అంతాఇంతా కాదు. చార్మినార్ పరిసరాల్లోకి అడుగుపెట్టాలంటే వెహికల్ను కిలోమీటర్ దూరంలో పార్క్ చేయాల్సిందే. ఈ రంజాన్ కోసం ఎంతో మంది చిరువ్యాపారులు ఎదురుచూస్తుంటారు. ఈ రంజాన్ మాసంలో చార్మినార్ పరిసరాల్లోకి అడుగుపెట్టాలంటే కాలు దూరదు.

రంజాన్ నెలలో చార్మినార్ నుంచి మదీనా సర్కిల్ వరకు వచ్చిపోయే వెహికల్స్ జనాలతో రద్దీగా ఉండేవి. రోడ్డుకు రెండువైపులా షాపులు వాటి ముందు తోపుడు బండ్ల కొనుగోళ్లతో కిటకిటలాడేవి. డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ మసాలా దినుసులు సేమియా బట్టలు బుర్ఖాలు ఖురాన్లు ఖురాన్ స్టాండ్స్ అత్తర్ సుర్మా టోపీలు కాస్మొటిక్స్ హౌస్ హోల్డింగ్స్ ఇలా అన్ని బిజినెస్లూ ఫుల్ గా నడిచేవి. కానీ ఈ సారి మహమ్మారి కారణంగా కనీసం బయట కాలు పెట్టలేని పరిస్థితి.

లాక్ డౌన్ రిలాక్సేషన్స్ తో కొన్ని ఓపెన్ చేసినా చేతిలో పైసల్లేక ఎవరూ పెద్దగా షాపింగ్ చేయడం లేదు. దాంతో రంజాన్ సీజన్ బిజినెస్ పై ఆధారపడ్డ వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. ఏటా రంజాన్ నెల చివరి శుక్రవారం మక్కామసీదులో వేల మంది ప్రార్థనలు చేస్తుంటారు. ఈసారి లాక్ డౌన్ ఎఫెక్ట్ తో సిబ్బంది ఐదుగురుకి మాత్రమే అనుమతిచ్చారు పోలీసులు. ఎక్కువమంది ఇండ్లల్లో కొద్దిమంది షాపుల్లో ప్రార్థనలు చేసుకున్నారు. ఇన్నేండ్లలో ఇలాంటి రంజాన్ చూడనే లేదంటున్నారు స్థానిక ముస్లింలు. కానీ వైరస్ వల్ల మనుషులకు మనుషుల విలువ తెలిసింది అని తొందరగా ఈ పరిస్థితి నుంచి కోలు కోవాలని ఆశిస్తున్నారు.
× RELATED ఒక్క పెగ్ వేసినా గుండెకు ముప్పే! ఆందోళన రేపుతున్న ఓ సర్వే
×