స్టార్ హీరోయిన్ హెల్ప్ అంటూ కేకలు పెట్టిందట

షూటింగ్స్ లేకపోవడంతో స్టార్స్ నుండి సినీ కార్మికుల వరకు అందరూ కూడా ఇంటికే పరిమితం అవుతున్నారు. హీరోయిన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తూ సరదాగా టైం ను గడుపుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గత కొన్ని రోజులుగా తన కుటుంబ సభ్యులతో కలిసి టైం పాస్ చేస్తూ ఆ వీడియోలు మరియు ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.

తాజాగా పూజా మరో ఆసక్తికర విషయాన్ని షేర్ చేసింది. ఈ సారి పూజా హెగ్డే తన డోర్ లాక్ అయ్యిందని దాతో మా కుటుంబం మొత్తం కూడా కొద్దీ సమయం చాలా ఇబ్బంది పడ్డట్లుగా చెప్పుకొచ్చింది. డోర్ ఎంతకు రాకపోవడంతో చేసేది లేక హెల్ప్ హెల్ప్ అంటూ అరిచినట్లుగా కూడా పూజ చెప్పింది. చివరకు డోర్ కు చిన్న రంద్రం చేసి ఓపెన్ చేసినట్లుగా పూజ హెగ్డే చెప్పింది.

ఈ అమ్మడు తెలుగు.. హిందీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉండాల్సింది పోయి ఇలా షూటింగ్స్ లేక ఇంట్లో ఉండి డోర్ లాక్ అయ్యింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది అంటూ ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో రెండు సినిమాలు చేయడం తో పాటు మరో రెండు సినిమాలకు కూడా ఈమె సైన్ చేసినట్లుగా తెలుస్తోంది. 
× RELATED అమ్మికి పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. ముద్దులాట ఓ లెక్కా!
×