ప్రధాని మోడీ కోసం నమిత ఏం చేసిందో తెలిస్తే షాక్

బొద్దుబొమ్మగా.. తమిళుల ఆరాధ్య హీరోయిన్ గా పేరు తెచ్చుకొని ఏకంగా గుడికట్టించుకున్న హీరోయిన్ నమిత. తెలుగులోనూ పలు సినిమాల్లో నటించింది. శృంగారతారగా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే పెళ్లి చేసుకున్న నమిత టెలివిజన్ రంగంవైపు అడుగులేస్తోంది.

తాజాగా రాజకీయాలపైన ఆసక్తి కనబరుస్తోంది. అందుకే ప్రధాని మోడీపై ఓ పాటను రిలీజ్ చేసి సంచలనం సృష్టించింది. మోడీ విధానాలు పథకాలు తనకు నచ్చాయని ఆయన ఫ్యాన్ గా మారిపోయానని నమిత తెలిపింది. అందుకే ఇటీవలే చెన్నైలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిపోయింది.

తాజాగా ప్రధాని మోడీపై ఓ పాటల ఆల్బమ్ ను నమిత ఆవిష్కరించింది. ఎస్కే బాలచంద్రన్ సంగీతం అందించిన ఈ పాటలతో మోడీపై తన అభిమానాన్ని చాటుకుంది నమిత.. ఇది తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది.

తమిళ సినీ పరిశ్రమలో దాదాపు పదేళ్లుగా అగ్రహీరోయిన్ గా నమిత రాణించింది.మొత్తం 40కిపైగా సినిమాల్లో నటించింది. చిత్తూరు కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడింది. ఇప్పుడు బీజేపీ రాజకీయాల్లో చేరి మోడీ నామస్మరణ చేస్తోంది.
× RELATED అమ్మికి పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. ముద్దులాట ఓ లెక్కా!
×