ఎన్టీఆర్ - అట్లీ రూట్ క్లియర్ అయినట్లేనా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తోన్న విషయం తెల్సిందే. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆయన కొమరమ్ భీమ్ గా డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. తరువాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయనున్నాడు. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే కొత్త సినిమా షూటింగ్ మే నుండి ప్రారంభం అవుతుందని ఇదివరకే ప్రకటించారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట. ఈ సినిమాకి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ను త్రివిక్రమ్ చాలా స్టైలిష్ గా చూపించనున్నాడనేది తాజా సమాచారం. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో మైత్రి మూవీ మేకర్స్ ఓ సినిమా నిర్మించాలని భావిస్తున్నారట. అందుకోసం ఎన్టీఆర్ కేజీఎఫ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో మూవీ చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టిందట.

నిజానికి ఈ ప్రాజెక్ట్ పై పరస్పర ఒప్పందాలు జరిగినట్లు సమాచారం. ఇక ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో కమిట్ అయ్యాడు. కెజిఎఫ్’ సినిమాతో దేశ వ్యాప్తంగా ప్రశాంత్ నీల్ పేరు మార్మోగింది. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొత్త సినిమా చేయబోతున్నట్లు.. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ ట్విట్టర్ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రశాంత్.. అదే ట్వీట్లో ఎన్టీఆర్తో సినిమా చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసాడు. అయితే ప్రశాంత్ అలా ట్వీట్ చేసాడో లేదో.. కన్నడ ఇండస్ట్రీలో వ్యతిరేక నినాదాలు మొదలయ్యాయి. మళ్లీ ప్రశాంత్ స్పందించి.. నేను కేవలం కన్నడలో మాత్రమే సినిమాలు చేస్తానని చెప్పాడు. ఇక మరి ప్రశాంత్ నిర్ణయంతో.. ఇక తెలుగు హీరో ఎన్టీఆర్ తో ఇంకేం సినిమా చేస్తాడులే అని వార్తలు మొదలయ్యాయి. ఒకవేళ నిజంగానే ప్రశాంత్ డ్రాప్ అయితే.. ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి తమిళ డైరెక్టర్ అట్లీ లైన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఇదివరకు కూడా అట్లీ ఎన్టీఆర్ తో సినిమా చేయాలనీ చాలా సార్లు వెల్లడించాడు. ఇక ప్రశాంత్ పక్కకు జరిగితే అట్లీతో సినిమా ఉంటుందేమో చూడాలి!

× RELATED ఆత్రేయ మాటకు వందనం .. ఆయన పాటకు అభివందనం! (ఆత్రేయ శత జయంతి)
×