ఛార్మి కారణంగా రమ్యకృష్ణపై ట్రోల్స్

గత రెండు నెలల కాలంగా విపత్కర కారణాల వల్ల సినిమా షూటింగ్స్ పూర్తిగా ఆగిపోయాయి. స్టార్స్.. సెలబ్రెటీలు.. ఫిల్మ్ మేకర్స్ ఇలా అందరూ కూడా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యి టైం పాస్ చేస్తున్నారు. అయితే పలువురు పలు రకాలుగా టైం పాస్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువ మంది టైం ను గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక చాలా మంది వీడియో కాల్ మాట్లాడటం.. సోషల్ మీడియా లైవ్ లోకి రావడం చేస్తున్నారు.

తాజాగా ఛార్మి పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో సందడి వాతావరణం కనిపించింది. పలువురు ప్రముఖులు మరియు అభిమానులు కూడా ఛార్మి కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రమ్యకృష్ణ ఇంకా జయంత్ సి పరాన్జీ కూడా ఛార్మి కి వీడియో కాల్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ స్క్రీన్ షాట్స్ ను ఛార్మి పోస్ట్ చేసింది.

ఆ ఫోటోల్లో రమ్యకృష్ణ చాలా హాటీగా కనిపించడంతో పలువురు ట్రోల్స్ చేస్తున్నారు. మీపై ఉన్న గౌరవం ను ఇలా  తగించుకోవద్దు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇలాంటి ప్రైవేట్ ఫోటోలు వీడియోలను ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారా అంటూ ఛార్మి ని కూడా కొందరు తిట్టిపోస్తున్నారు. ఇక జయంత్ తనకు మాస్క్ పెట్టుకొని మరి ముద్దు పంపించాడు అంటూ సరదాగా ఛార్మి పోస్ట్ చేసింది.
× RELATED అమ్మికి పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. ముద్దులాట ఓ లెక్కా!
×