ఎక్స్ క్లూజివ్ : స్టార్ హీరోతో శేఖర్ కమ్ముల నెక్స్ట్ ప్రాజెక్ట్..!

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల 'డాలర్ డ్రీమ్స్' అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. లవ్ స్టోరీస్ సున్నితంగా చూపించడంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల దిట్ట అనే చెప్పాలి. శేఖర్ కమ్ముల అనగానే వెంటనే మంచి ఫీల్ గుడ్ చిత్రాలే గుర్తుకు వస్తాయి. శేఖర్ కమ్ముల సినిమాలలో అనుబంధాలు పెనవేసుకునేలా పాత్రల చిత్రీకరణ ఉంటుంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆనంద్’ ‘గోదావరి’ ‘హ్యాపీడేస్’ ‘ఫిదా’ చిత్రాలు ఎంతటి ఘన విజయాలను సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శేఖర్ కమ్ముల ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య - సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా 'లవ్ స్టోరీ' అనే సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 'లవ్ స్టోరీ' చిత్రానికి సంబంధించి టీజర్.. సాంగ్ లిరికల్ వీడియోలు విశేష ఆదరణ పొందాయి. 'లవ్ స్టోరీ' సినిమాతో మరోసారి నాగ చైతన్య - సాయి పల్లవి జంటతో ఆయన తెలుగు ప్రేక్షకులను మెప్పించడం ఖాయమనిపిస్తోంది. ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో మూవీ ప్రొడక్షన్ లోకి దిగుతోంది. నారాయణదాస్ కె నారంగ్ మరియు ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా విడుదల చేయాలని భావించారు. కానీ దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన కుదరలేదు. ఇదిలా ఉండగా శేఖర్ కమ్ముల నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి టాలీవుడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

తాజా సమాచారం ప్రకారం 'లవ్ స్టోరీ' మూవీ తర్వాత శేఖర్ కమ్ముల తన నెక్స్ట్ మూవీ కూడా ఏషియన్ వారికే చేయనున్నాడట. ఈ సినిమాలో ఓ పెద్ద హీరో నటించబోతున్నాడని.. ఆల్రెడీ స్టోరీ డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయని సమాచారం. 'లవ్ స్టోరీ'కి కేవలం 15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండటంతో తన నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేసాడట. 'లవ్ స్టోరీ' సినిమా రిలీజ్ అయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందట. క్రైసిస్ సమయంలో కూడా తన నెక్ట్ సినిమా సేమ్ ప్రొడ్యూసర్ తో కమిట్ అవ్వడం శేఖర్ కమ్ముల మంచితనానికి నిదర్శనమనే చెప్పాలి. 'లవ్ స్టోరీ' మీద కాన్ఫిడెంట్.. శేఖర్ కమ్ముల మీద ఉన్న నమ్మకంతో ప్రొడ్యూసర్స్ కూడా తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ కు ఆయనతో సైన్ చేసేసుకున్నారని తెలుస్తోంది. శేఖర్ కమ్ములకి సినిమా పట్ల ఉన్న కమిట్మెంట్.. 'లవ్ స్టోరీ' సినిమాని అనుకున్న బడ్జెట్ లోనే కంప్లీట్ చేయడం మొదలైన విషయాలు నిర్మాత నారాయణ్ దాస్ నారాంగ్ కి నచ్చాయట. అందుకే ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్ మీద నారాయణ్ దాస్ నారంగ్ నిర్మించనున్నారట. మిగతా వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
× RELATED సర్కారు వారి పాట.. స్టోరీలైన్ అదుర్సే!
×