నిశ్శబ్దంగా ఇంకొన్నాళ్లు ఎదురు చూస్తారట!

అనుష్క కొంత గ్యాప్ తర్వాత నటించిన "నిశ్శబ్దం" సినిమా విడుదల విషయంలో ఊగిసలాట కొనసాగుతోంది. గత ఏడాది ఈ సినిమాను విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి మరింతగా గందరగోళ పరిస్థితిలో పడ్డట్లయ్యింది.

థియేటర్లు ఎప్పటికి తెరచుకునేనో తెలియదు. సినిమా ల విడుదల విషయంలో ఎప్పుడు ఒక క్లారిటీ వచ్చేది చెప్పలేని పరిస్థితి. అందుకే నిశ్శబ్దం సినిమాను OTT ద్వారా విడుదల చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కు డిజిటల్ రేటు భారీగా పలుకుతుంది. అందుకే సినిమాను అమ్మేయాలని భావించారు అంటూ వార్తలు వచ్చాయి.

తాజాగా నిర్మాత కోన వెంకట్ ఈ విషయమై స్పంచించాడు. మా మొదటి ప్రాముఖ్యత థియేట్రికల్ రిలీజ్. దాని కోసం ఎదురు చూస్తున్నాము. కానీ ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి లేకుంటే అప్పుడు ప్రత్యామ్నాయం కు వెళ్తామని ఈ సందర్భంగా కోన వెంకట్ చెప్పుకొచ్చాడు. అంటే మరి కొన్ని రోజులు ఎదురు చూసి అప్పటికి థియేటర్ లలో విడుదల సాధ్యం కాకుంటే అప్పుడు OTT కి వెళ్తామని ఇండైరెక్ట్ గా చెప్పకనే చెప్పారు.
× RELATED 100వ సినిమాకి ట్రై చేస్తే 107వ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ దొరికిందట..!
×