చంద్రముఖిగా అప్పుడు మిస్సయింది.. ఇప్పుడు దక్కిందా?

జ్యోతిక అనే అమ్మాయిని కేవలం గ్లామర్ హీరోయిన్గా చూసే రోజుల్లో ఆమెలో ఓ అద్భుత నటి ఉందని రుజువు చేసిన సినిమా చంద్రముఖి. అప్పటిదాకా జ్యోతిక ఎక్కువగా గ్లామర్ క్యారెక్టర్లే చేసింది. నటిగా అంత మంచి గుర్తింపేమీ లేదు. కానీ చంద్రముఖిలో ఆమె గంగ పాత్రలో ఎంతటి అద్భుత అభినయం ప్రదర్శించిందో.. ఎంత మంచి గుర్తింపు సంపాదించిందో తెలిసిందే. ఐతే నిజానికి ఈ పాత్ర కోసం ముందు అనుకున్నది జ్యోతికను కాదు. ఆమె కంటే సీనియర్ అయిన సిమ్రాన్‌ను. కానీ ఎందుకో గానీ ఆమె ఆ సినిమా చేయలేకపోయింది. జ్యోతికను తీసుకున్నారు. కట్ చేస్తే.. ఇప్పుడు సిమ్రాన్ చంద్రముఖి-2లో భాగం కాబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి.

రజనీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిన చంద్రముఖికి సీక్వెల్ రాబోతున్నట్లు ఇటీవలే రాఘవ లారెన్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి చంద్రముఖి దర్శకుడు పి.వాసునే దర్శకత్వం వహించనున్నాడు. ఆయన ఆల్రెడీ తెలుగులో నాగవల్లి కన్నడలో ఆప్తమిత్ర పేరుతో చంద్రముఖి సీక్వెల్స్ తీశారు. కన్నడలో బాగానే ఆడినా.. తెలుగులో ఆ చిత్రం డిజాస్టర్ అయింది. ఐతే ఇప్పుడు వేరే కథతో తమిళంలో చంద్రముఖి-2 తీయబోతున్నాడు.

సన్ పిక్చర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుంది. ఇందులో రజనీ క్యామియో రోల్ చేసే అవకాశముందంటున్నారు. లారెన్స్ పాత్ర రజనీ క్యారెక్టర్‌కు కొనసాగింపులా ఉంటుందట. కాగా.. జ్యోతిక చేసిన గంగ పాత్రలో ఈసారి సిమ్రాన్ కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. ఐతే వయసు మీద పడి గ్లామర్ దెబ్బ తిన్న సిమ్రాన్‌ను ఈ పాత్రకు ఎంచుకోవడం కరెక్టేనా అన్నది జనాల ప్రశ్న. ఈ వార్త నిజమే అయితే.. సిమ్రాన్‌కు అప్పుడు మిస్సయిన ఛాన్స్ ఇప్పుడిలా మళ్లీ రావడం ఆశ్చర్యమే. 
× RELATED టబు ని బుట్టలో వేసుకున్న ఆ స్టార్ హీరోలు ఎవరు..?
×