ఐఆర్ఎస్డీసీలో భాగస్వామి అయిన మరో కంపెనీ

రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కార్పొరేషన్ (ఐఆర్ఎస్డిసి) లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెన్సీ ఇంజనీరింగ్ సంస్థ రైట్స్  24 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం విలువ రూ .48 కోట్లు. అయితే ఈ ఒప్పందంలో రైట్స్ సంస్థతో పాటు రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ ఐఆర్కాన్ ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా ఉన్నాయి. ీ మేరకు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ లాక్డౌన్ కాలంలో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పిన రైట్స్... సిఎఫ్ఎమ్ మొజాంబిక్ తో పెద్ద ఎగుమతి ఒప్పందం అందులో ఒకటి అని రైట్స్ లిమిటెడ్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ మెహ్రోత్రా తెలిపారు. లాక్ డౌన్ సడలింపుల అనంతరం తిరిగి తన కార్యకలాపాలను ప్రారంభించిన ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లోని గూటీ-ధర్మవరం వద్ద రైల్ లైన్ రెట్టింపు ప్రాజెక్ట్ పనులు కూడా తిరిగి ప్రారంభించింది. ఇవి వేగంగా కొనసాగుతున్నాయి. దీంతో పాటు రాజస్థాన్లో రైల్వే విద్యుదీకరణ పనులు తదితరాలను ప్రారంభించినట్లు రాజీవ్ పేర్కొన్నారు.  ఈ ఒప్పందాల ద్వారా రైట్స్ మరింత విలువైన కంపెనీగా ఎదిగింది.
× RELATED ప్రధానికి కేసీఆర్ లేఖ: విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణకు డిమాండ్
×