ప్రభాస్ - పూరీ కాంబోలో హ్యాట్రిక్ మూవీ సెట్ అయ్యేనా...?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ 'బుజ్జిగాడు'. 2008 మే 22న రిలీజైన ఈ సినిమా వచ్చి నేటికి 12 ఏళ్ళు పూర్తయింది. మోహన్ బాబు త్రిష సంజన సునీల్ తదితరులు కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఎస్. రామారావు నిర్మించారు. హీరో ఎలివేషన్ సీన్స్ ని.. హీరోలోని మాస్ యాంగిల్.. హీరోయిజం ప్రజెంట్ చేయడంలో పూరీని మించిన డైరక్టర్ లేడంటే అతిశయోక్తి కాదు. పూరితో చేసిన ఏ హీరోకైనా తన డైలాగ్ డిక్షన్.. బాడీ లాంగ్వేజ్.. హీరో ఇమేజ్ మారిపోవడం అనేది కామన్ గా జరుగుతుంది. 'బుజ్జిగాడు' సినిమాతో ప్రభాస్ కి కూడా అదే జరిగింది. యంగ్ రెబల్ స్టార్ కి ఈ సినిమాతో మాస్ ఇమేజ్ వచ్చి పడింది. అప్పటి వరకు ఒక టైపులో యాక్టింగ్ చేసుకుంటూ వెళ్తున్న డార్లింగ్ ఒక్కసారిగా తనలోని మాస్ యాంగిల్ బయటకి తీసాడు. కాకపోతే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదనే చెప్పవచ్చు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రెండో సినిమాగా 'ఏక్ నిరంజన్' వచ్చింది. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ఆదిత్యరామ్ మూవీస్ వారు నిర్మించారు. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ప్రభావాన్ని చూపించలేకపోయింది. ఇప్పటి వరకు వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాయి.

'బుజ్జిగాడు' ఈ సినిమా వచ్చి 12 ఏళ్ళు అయిన సందర్భంగా వీరిద్దరు కలిసి మళ్ళీ హ్యాట్రిక్ సినిమా ఎప్పుడు చేస్తారనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. పూరీ జగన్నాథ్ గతేడాది 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చాడు. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ పూరీతో ఒక మంచి మాస్ మసాలా మూవీ కోరుకుంటున్నారు. 'బుజ్జిగాడు' టైపు ఆటిట్యూడ్ తో డార్లింగ్ చెప్పే డైలాగ్స్ వినాలని ఆశపడుతున్నారు. అయితే ఇప్పుడు 'బాహుబలి' సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు ప్రభాస్ టాలీవుడ్ స్టార్ హీరో మాత్రమే కాదు పాన్ ఇండియా స్టార్ కూడా. ఈ నేపథ్యంలో అన్ని సినిమాలు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ పూరీని నమ్మి మరో ప్రాజెక్ట్ చేతిలో పెడతాడా..? అందులోనూ ఇప్పటికే తన కెరీర్లో 20వ చిత్రాన్ని 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తీస్తున్నాడు. ఈ సినిమా పూర్తైన వెంటనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక పాన్ ఇంటర్నేషనల్ సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తవడానికి సుమారు మూడేళ్ళ సమయం పట్టే అవకాశం ఉంది. అంటే వీరిద్దరి కాంబినేషన్ హ్యాట్రిక్ మూవీ ఇప్పట్లో సెట్ అయ్యే ఛాన్సెస్ కనిపించడం లేదని చెప్పవచ్చు.
× RELATED 100వ సినిమాకి ట్రై చేస్తే 107వ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ దొరికిందట..!
×