మహమ్మారి దెబ్బకు ప్రముఖ స్టోర్ల మూసివేత

ప్రముఖ డిజైనర్ సంస్థ ఈ మహమ్మారి దెబ్బకు కుదేలైంది. ఏకంగా నాలుగింట ఒక వంతు సొంత స్టోర్లను శాశ్వతంగా మూసివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా కెనడాలో తమ రిటైల్ స్టోర్లను మూసివేసి వందలాది మంది ఉద్యోగులకు స్వస్తి పలికింది.

ప్రముఖ అమెరికా డిజైనర్ సంస్థ ‘విక్టోరియా సీక్రెట్’ నాలుగింట ఒక వంతు స్టోర్లను శాశ్వతంగా మూసివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా కెనెడాల్లో తమ రిటైల్ స్టోర్లను మూసేసింది. మహమ్మారి సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ రిటైలర్ సంస్థ 250 స్టోర్ల మూసివేతను ప్రారంభించింది.కొన్ని ఏళ్లలో మరిన్ని స్టోర్లను మూసివేస్తామని తెలిపింది.

అమెరికాలో దాదాపు 1100 విక్టోరియా సీక్రెట్ స్టోర్లు సంస్థకు ఉన్నాయి. ప్రైవేటు ఈక్విటీ సంస్థ సికోమోర్ పార్టనర్స్ మే నెలలో విక్టోరియా సీక్రెట్ సంస్థలోకి పెట్టుబడులను రద్దు చేసుకోవడంతో సంస్థ ఈ సంక్షోభాన్ని తట్టుకోలేక స్టోర్ల మూసివేత నిర్ణయాన్ని తీసుకుంది.

ఈ సంస్థ ఆదాయం ఈ లాక్ డౌన్ లో 37 శాతం మేర క్షీణించాయి. మార్చి నుంచి నష్టాలు తట్టుకోలేక స్టోర్లను మూసివేస్తూ వస్తోంది.
× RELATED మారని కిమ్ తీరు..ఈ టైమ్ లోనూ అణ్వాయుధాల పైనే ఫోకస్
×