సోగ్గత్తె చిన్నినాయనా.. ఆఫర్లు ఇవ్వండ్రా నాయనా!

ప్రగ్య జైస్వాల్ 'డేగ' అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.  ఆ సినిమా సంగతి జనాలకు పెద్దగా తెలియదు కానీ క్రిష్ - వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'కంచె' సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.  అప్పటి వరకూ బాగానే ఉంది కానీ తర్వాత ఎంచుకున్న సినిమాలు అన్నీ ఫ్లాప్ కావడంతో ఈ బ్యూటీ కెరీర్ వెనక్కు పోవడమే తప్ప ముందుకు ఒక్క అడుగు కూడా పడడంలేదు.

ప్రగ్య లాస్ట్ సినిమా 'ఆచారి అమెరికా యాత్ర'.  ఈ సినిమా ఏప్రిల్ 2008 లో రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రగ్య కు మరో ఆఫర్ రాలేదంటే దాదాపుగా టాలీవుడ్ ఈ భామను మర్చిపోయినట్టే. అయితే భామ పెద్దగా నిరాశకు గురి కాకుండా.. సోషల్ మీడియా రైతుగా ఇన్స్టా లో.. ట్విట్టర్ లో గ్లామర్ పంటలు పండిస్తూ లైకుల.. కామెంట్ల దిగుబడి సాధిస్తోంది.  ఇంత అందం ఉన్నప్పటికీ.. నటనలో కూడా మంచి మార్కులే తెచ్చుకుంటున్నప్పటికీ ఎందుకో మన ఫిలింమేకర్లు మాత్రం ప్రగ్యకు ఆఫర్లు ఇవ్వడం లేదు.

టాప్ హీరోలందరితో సినిమాలు చేయగల లక్షణాలు అన్నీ ఉన్నప్పటికీ ఇలా సోషల్ మీడియాకే పరిమితం కావడం బాధాకరమని.. ఈ సోగ్గత్తె టాలీవుడ్ లో ఉందనే వాస్తవం గుర్తించి మంచి ఆఫర్లు ఇస్తే బాగుంటుందని అభిమానులు కోరుతున్నారు. మరి ఈ అభ్యర్ధన మీకు అర్థం అవుతోందా?
× RELATED 100వ సినిమాకి ట్రై చేస్తే 107వ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ దొరికిందట..!
×