ఫోటో స్టోరీ: మళ్లీ మొదలెట్టిన పటాని!

హీరోయిన్లు చాలామంది ఉంటారు కానీ అందరికీ క్రేజ్ రాదు. అయితే కొందరు మాత్రం క్రేజ్ కు కేరాఫ్ అడ్రెస్ అన్నట్టుగా ఉంటారు. దిశా పటాని అదే కేటగిరీకి చెందిన భామ. సామాజిక మాధ్యమాల తోలు వలిచి ఓ చక్కటి కలర్ ఫుల్ బికినీ కుట్టించుకోవడంలో దిశా పటాని ఎప్పుడూ ముందే ఉంటుంది. ఒక్కసారి అలా ఫోటో పోస్ట్ చేస్తే చాలు మిలియన్ల కొద్ది లైక్స్ వచ్చి పడతాయి.

తాజాగా దిశా మరోసారి అదేపని చేసింది. తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక బికినీ ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు. జస్ట్ ఓ పువ్వు ఎమోజి.. ఓ అల ఎమోజిని మాత్రం పెట్టింది. ఈ ఫోటోలో ప్రింటెడ్ కలర్స్ ఉండే మొనోకిని ధరించి బీచ్ ఇసుకలో మోకాళ్లపై కూర్చుంది. అసలే పటాని కావడంతో అందాల విందుకు లోటేమీ చెయ్యలేదు. బీచ్ లొకేషన్ కూడా అదిరిపోయింది. మరి ఈ ఫోటోను తీసింది ఎవరో మాత్రం దిశ వెల్లడించలేదు. అయినా ఫోటో ఎవరు తీస్తే ఏంటి.. అందులో గ్లామర్ మాత్రం ఉంటే చాలు. మిగతావి ఉన్నా లేకపోయినా ఫర్వాలేదు. అందుకే ఎంతోమంది తమ లైకులతో పటానికి జేజేలు తెలిపారు. టైగర్ ష్రాఫ్ కూడా పనిలో పనిగా ఓ లైక్ వేసుకున్నాడు.

ఆయన ఎవరని అడక్కండి.. రెండు నెలల క్రితం "మిత్రోం.. ప్యారీ దేశ్ వాసియో" అనే స్పీచ్ వచ్చిన దగ్గర నుంచి ఈమెగారు-ఆయనగారు ఒకే ఇంట్లో కలిసిమెలిసి ఉన్నారు. ఒకరినొకరు ఎంచక్కా అర్థం చేసుకుంటున్నారు. కలిసి కసరత్తులు కూడా చేస్తున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఎందుకంటే ఇద్దరూ ఫిట్నెస్ ఫ్రీక్సు. ఇక దిశ ఫ్యూచర్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ 'రాధే' సినిమాలో నటిస్తోంది.
× RELATED సర్కారు వారి పాట.. స్టోరీలైన్ అదుర్సే!
×