భారత్ పై అక్కసు:ప్రణాళిక చైనాది..అమలు నేపాల్ ది!

భారత్ లో ఒక రాష్ట్రమంతా ఉండే దేశం.. అన్నింటికి భారత్ పైన ఆధారపడే ఆ దేశం.. ఒక్కసారిగా గాండ్రిపులు చేయడం ఏమిటీ? ఏకంగా భారత్ కే నోటీసులు జారీ చేయడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. పిల్లి పులి గాండ్రిపులు చేయడం మాదిరి నేపాల్ వ్యవహారం ఉంది. కొన్ని రోజులుగా నేపాల్ వ్యవహారం భారత్ కు తలనొప్పిగా మారింది. ఏనాడు భారత్ పై మాటెత్తని నేపాల్ తొలి సారిగా భారత్ పై ఆగ్రహంతో ఉంది. కొన్ని విషయాలపై భారత్కు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఏకంగా నోటీసులు పంపించే స్థాయికి నేపాల్ తీరు చేరింది. పసికూన దేశానికి అంత ధైర్యం ఏమిటి? ఎందుకు ఇలా వ్యవహరిస్తుందనడానికి కారణాలు చాలానే ఉన్నాయి. అయితే నేపాల్ వెనుక చైనా ఉందని అందరికీ తెలుస్తున్న విషయం. డ్రాగన్ అండ చూసుకుని నేపాల్ రెచ్చిపోతున్నది.

చైనా భారతదేశంపై ఆగ్రహంగా ఉంది. తమ దేశ కంపెనీల పెట్టుబడులు ఆహ్వానించడం - మహమ్మారి వైరస్ పై విచారణ చేయాలని భారత్ కోరడం వంటి వాటితో చైనా మండిపడుతోంది. ఈ నేపథ్యంలో చైనా భారత్ ను రెచ్చగొడుతూనే భారత్ తో సన్నిహితంగా ఉంటున్న చైనాతో భారత్ ఫై అక్కసు వెళ్లగక్కేలా చేస్తోంది. అందులో భాగంగా నేపాల్ కూడా మన భూభాగంపైనే ఎదురు తిరుగుతోంది. ఈ సందర్భంగా మానస సరోవర్ యాత్రకి దారి తమ భూభాగంలోంచి కుదరదంటూ నేపాల్ ప్రకటనలు ఇస్తోంది.

లద్దాక్ ప్రాంతంలో భారత్కి రెండు ప్రధాన ఎయిర్ ఫోర్స్ స్థావరాలున్నాయి. వాటిలో లేహ్ సెక్టార్ ఒకటి.. లేహ్ నుంచే వాస్తవాధీన రేఖ వెంట ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గస్తీ నిర్వహిస్తోంస్తుంది. నాకులా పాస్ సెక్టార్ సిక్కిం దగ్గర ఉంది. చైనాకి సిక్కిం బోర్డర్ ప్రారంభమయ్యే చోటు ముగుతాంగ్ అనే ప్రదేశానికి దగ్గరగా ఉంది. ముగుతాంగ్ వద్దనే టిబెట్ శరణార్ధులు తలదాచుకుంటుంటారు. ఇక్కడ ఆధిపత్యం చెలాయిస్తే.. టిబెట్పై కూడా పెత్తనం చేయవచ్చనేది చైనా ప్లాన్..

నేపాల్ ని వెనక నుంచి చైనా రెచ్చగొడుతోంది. మానససరోవర యాత్ర లిపూలేఖ్- ధారచులా మీదుగా వెళ్లేందుకు రోడ్డు నిర్మిస్తే.. అది తమ భూభాగం నుంచి వెళ్తుందని నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈరోడ్డు నిర్మిస్తే హిమాలయాలకు వెళ్లేందుకు కనీసం వెయ్యి కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఇది మన భూభాగం మన ఇష్టం. మన భూభాగంలో కైలాసయాత్ర జరపడంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేయడం - పైగా దానిపై మన రాయబారి వినయ్ మోహన్ క్వట్రాకు నోటీసులు జారీ చేయడం చేస్తుంటే మేకపోతు గాంభీర్యాలకు నేపాల్ వెళ్తోందని తెలుస్తోంది.

లిపూలేఖ్ తమ ఆధీనంలోని ప్రాంతమంటూ ప్రకటించింది. లిపూలేఖ్ - కాలాపానీ - లింపియాధుర ప్రాంతాలను తన దేశంలోని భాగాలని - ఏకంగా ఓ మ్యాప్ నే తయారుచేసింది. ఉత్తరాఖండ్ లోని ధారచులా ప్రాంతాన్ని తమ భూభాగంగా చెప్పడం భారత్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించే విషయం. చైనా అండ చూసుకుని నేపాల్ రెచ్చిపోతుందని అందరికీ తెలుస్తోంది. త్వరలోనే భారత్ గట్టి సమాధానం ఇచ్చే అవకాశం ఉంది.
× RELATED మారని కిమ్ తీరు..ఈ టైమ్ లోనూ అణ్వాయుధాల పైనే ఫోకస్
×