ఆ కంట్రీ లో ఇల్లు ఎంత చౌకనో తెలుసా ?

ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కల ...ఎప్పటికైనా సొంత ఇల్లు అనేది నిర్మించుకోవాలి. అయితే ఒక జీవిత కాలం కష్టపడినా కూడా ఇప్పటి రోజుల్లో మన దేశంలో సొంతింటిని ఏర్పరచుకోవడం కష్టమే. ఎందుకంటే ప్రతి వస్తువు ధర విపరీతంగా పెరగడం వల్ల సామాన్యులు దిగువ మధ్య తరగతి కుటుంబీకులకు సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది. అయితే ప్రపంచంలోనే అత్యంత సుందరమైన ప్రదేశంగా ఇటలీలోని ముస్సోమెలి కి  ఓపేరు ఉంది .. ఆ ప్రాంతాన్ని హిల్ ఆఫ్ హనీగా కూడా ఇష్టంగా పిలుచుకుంటారు.

అయితే ప్రపంచంలోనే అత్యంత సుందరమైన ఈ ప్రదేశంలో అత్యంత చౌక ధరకే ఇల్లు మన సొంతం అవుతుంది అంటే నమ్మడానికి ఎవరికైనా కొంచెం టైం పడుతుంది.  కానీ ఇదే నిజం. ఒక్కో ఇల్లు ఒక డాలర్ లేదా అంతకంటే తక్కువకే సొంతమవుతుందంటే ఎవరు మాత్రం నమ్ముతారు. వాతావరణ కాలుష్యానికి దూరంగా ప్రకృతి ఒడిలో ఓలలాడాలనే మనుషులు మనసులకు ఇది ఎంతో ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఇస్తుందంటే అతిశయోక్తి కాదు.

దీంతో ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోడానికి సామాన్యులు మొదలుకుని ధనవంతుల వరకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. కాకపోతే ఇప్పుడు ఈ  వైరస్ బారిన పడి అందమైన ఈ ప్రాంతం శ్మశానాన్ని తలపిస్తుంది. అయితే ఇప్పుడిప్పుడే  ఆ మహమ్మారి నుండి అందమైన ముస్సోమెలి తేరుకుంటోందని సమాచారం. చౌకగా ఇల్లు మనసును పరవశానికి లోను చేసే ప్రకృతి రమణీయత కాలుష్యం లేని ఆ జీవితాన్ని ఊహించుకుంటే స్వర్గంలో విహరిస్తున్నట్టు అనిపిస్తుంది. అలాంటి ఇల్లులు మన దేశంలో ఎందుకు లేవు అని అనిపిస్తుంది కదా ...
× RELATED టీటీడీ చెప్పినట్లు ఇప్పుడు ఆస్తులు అమ్మితే వచ్చేదెంత?
×